Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం..?
Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Gadwal District: కృష్ణా నది నీటిలో చేపల వేటకు వెళ్లిన బాలుడు నీటి ప్రవాహానికి గల్లంతైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లోని గద్వాల మండలం రేకులపల్లి(Rekupally) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గత రాత్రి 8 గంటల ప్రాంతంలో చందు తో పాటు మరొకరు గ్రామానికి సమీపంలోని కృష్ణా నది(Krishna River) నీటిలో చేపల వేటకు వెళ్లారు. వల విసిరిన అనంతరం ఒక గంట అయితే చేపలు పడతాయని ఉద్దేశంతో వల విసిరిన అనంతరం ఒక గంట కోసం బయటకి వెళ్లడం ఎందుకు అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ బోట్ లోనే నిద్రించారు. ఇదే ఆలోచన మృత్యువు రూపంలో కబలిస్తుందని.. జూరాల డ్యాం(Jurala Dam)కు నీటి ప్రవాహం పెరగడంతో డ్యాం క్రస్ట్ గేట్లు అదనంగా మూడు గేట్లు తెరవగా పెరిగిన నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయారు.

Also Read: Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

8 నుంచి 11 గేట్లను తెలిసిన జూరాల సిబ్బంది

జూరాలకు నీటి ప్రవాహం పెరగడంతో అక్కడ అధికారులు 8 నుంచి అదనంగా మరో మూడు గేట్లను తెరిచారు. దీంతో నదీ ప్రవాహం నీరు ఉదృతంగా ప్రవహిస్తునడంతో ప్లాస్టిక్ బోట్(Plastic Boat) బోల్తా పడింది. ఈ క్రమంలో ఒక యువకుడు నీటి ప్రవాహం నుంచి తప్పించుకోగా 8వ తరగతి చదువుతున్న చందు (13) నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఆ బాలుడికి ఈత సైతం రాకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు

నేడు మాల పూర్ణమి అనే పండుగను గ్రామంలో జరుపుకుంటుండగా మరోవైపు విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంతో పాటు గ్రామస్తులు బాలుడు ఆచూకీ కోసం నది ఒడ్డున ఎదురుచూస్తున్నారు.

Also Read: BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..