BRS Comittees
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

BRS Committees: ‘స్థానికం’ తర్వాతే గులాబీ కమిటీలు?
ముందుగానే కమిటీలు వేస్తే పార్టీకి నష్టమనే భావన
నేతల పనితనం బట్టి పదవులు?
ఇప్పటికే నేతలపేర్ల సేకరణలో అధిష్టానం
నేతలకు అండగా ఉంటామని హామీ
పార్టీ మారకుండా ఉండేందుకు భరోసా

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బీఆర్ఎస్ పార్టీ కమిటీలకు (BRS Committees) శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. సభ్యత్వ నమోదు సైతం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుపార్టీ వర్గాలు తెలిపాయి. నేతల పనితీరును బట్టే పదవులు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేవారి కంటే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. మరోవైపు నేతలు పార్టీ మారకుండా వారికి పదవుల భరోసా కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ 2017 తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏ ఒక్క కమిటీనీ వేయలేదు. కేవలం జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఇన్‌ఛార్జులుగా ప్రకటించింది. మళ్లీ పార్టీ పదవులు ఎవరికీ కట్టబెట్టలేదు. పార్టీ నుంచి ఇతర పార్టీకి వెళ్లిన నేతల పోస్టులను సైతం భర్తీ చేయలేదు. కేశవరావు పార్టీలో సెక్రటరీ జనరల్ పదవి ఉండి, కాంగ్రెస్‌లో చేరినా ఆ పోస్టును తిరిగి భర్తీ చేయలేదు. ఇలా రాష్ట్ర కమిటీల్లోనూ పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామం ఇలా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులను మాత్రమే నియమించి పూర్తి కమిటీని వేయడం పెండింగ్‌లో పెట్టింది. దీంతో, కమిటీల్లో చోటు కోసం ఆశించిన నేతల్లో నిరాశ నెలకొంది. కొందరు భంగపడ్డనేతల్లో కొందరు పార్టీ సైతం మారారు. అయినప్పటికీ పార్టీ మాత్రం కమిటీలను లైట్‌గా తీసుకుంది.

Read Also- Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తుందని పార్టీ నేతలంతా ఆశించారు. 20 నెలలు దాటినా పార్టీపై పార్టీ అధిష్టానం దృష్టిసారించలేదు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు అయినా కమిటీలు వేస్తుందని ఆశించినా అది కూడా జరగలేదు. ఎన్నికల ముందు కమిటీలు వేస్తే .. పదవులు దక్కించుకున్న నేతలు పార్టీ మారితే భారీ నష్టం జరుగుతుందని, కేడర్‌లోకి ప్రతికూల సందేశం వెళుతుందని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇప్పటికే కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో మళ్లీ కమిటీల తర్వాత నేతలు వలసలుపోతే భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. కొందరు పార్టీ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ నష్ట నివారణకే పార్టీ కమిటీలను పెండింగ్‌లో పెట్టారని విశ్వసనీయ సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించబోతుంది. డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో రిజిల్ట్ తీసుకొచ్చేదాన్ని బట్టి నేతల పనితీరు, ప్రజల్లో ఉన్న ఆదరణ, వారు భవిష్యత్‌లో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తారా? లేదా? అనేది తెలుస్తుందని, తద్వారా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ సైతం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా బలమైన నేతల వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అధిష్టానం వద్ద కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇంకా యాక్టి‌వ్‌గా ఉన్న వారి వివరాలను సేకరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, నేతల మధ్య గ్యాప్‌తోనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయని నేతల వద్ద పార్టీ అధిష్టానం వెల్లడించింది. అలాంటి ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాకూడదనే ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది.

Read Also- Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

ద్వితీయ శ్రేణి నాయకులకు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంగ్‌గా భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పాలనపైనే దృష్టిసారించామని, పార్టీని, నేతలను పట్టించుకోలేదని ప్రతీ సమావేశంలో పేర్కొనడంతో పాటు పార్టీకి కోసం పనిచేసే నేతలందరికి పదవుల అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గత తప్పిదాలు పునరావృతం కాబోవని, రాబోయే ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ దేనని, అప్పుడు పార్టీకోసం పనిచేసే ప్రతీ ఒక్కరికి గుర్తింపు తప్పక ఇస్తామని ప్రకటిస్తున్నారు. పార్టీ మారి ఇబ్బందులు పడుతున్న నేతల పేర్లను సైతం ప్రస్తావిస్తు రాజకీయ జీవితాన్ని పాడుచేసుకోవద్దని నేతలకు హితవు పలుకుతున్నారు. నేతలు పార్టీమారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా నేతల పనితీరును బట్టి పదవులు ఇస్తామని మాత్రం కేటీఆర్ స్పష్టంగా హిట్ ఇస్తున్నారు. అయితే పార్టీ కమిటీల్లో అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Just In

01

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్