Kadiyam Srihari: 10ఏండ్లు అదికారంలో ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం ఆ కబ్జా చేసిన వేల ఎకరాల భూములను, దోచుకున్న వేల కోట్ల రూపాయల సొమ్మును పంచుకునే పంచాయతీ అని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా నవాబుపేట రిజర్వాయర్ వద్ద గోదావరి నీటిని పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాలకు విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు.
Also Read: GHMC: కాలువ శుభ్రతకు రోబోటిక్ టెక్నాలజీ.. జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం
వేల ఎకరాల భూములను కబ్జా?
ఈ సందర్భంగా కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా(Jangaon District) నవాబుపేట రిజర్వాయర్ వద్ద గోదావరి నీటిని పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాలకు విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు. విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న గొడవ ఆస్తి పంపకాలకు సంబందించిన గొడవ అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణలోని అన్ని వనరులను విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల భూములను కబ్జా చేశారు. కాళేశ్వరంను అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దోచుకున్న సొమ్మును, కబ్జా చేసిన భూములను పంచుకునే దగ్గర కవితకు కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నది అందుకే ప్రజలను ఆపార్టీని పక్కన పెట్టారు.
ఇది ఆస్తుల గొడవే కానీ ప్రజల గొడవ కాదు
ఈ పంచాయతీతో తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది ఆస్తుల గొడవే కానీ ప్రజల గొడవ కాదని స్పష్టం చేశారు. పంచుకునే పంచాయతీ అని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. నేను కల్వకుంట్ల కవిత(Kavitha) వల్లనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కామ్‌లో ఇన్‌వాల్వ్ అయింది. ఆమే విచారణకు వెళ్ళింది.. జైలుకు వెళ్ళింది. ఇది నాకు బాదనిపించింది. ఇది సరైన పద్దతి కాదని భావించి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని అన్నారు. అవినీతి సొమ్మును పంచుకునే పంచాయతీ అని ప్రజలు ఆలోచించాలని అన్నారు. కడియంతో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, నాయకులు ఉన్నారు.
Also Read: Jagan vs RRR: జగన్‌కు బిగ్ షాక్.. పులివెందులలో బై ఎలక్షన్స్.. బాంబ్ పేల్చిన రఘురామ!