GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు వీలుగా సిటీలోని వరద నీటి కాలువల్లో ఎలాంటి అడ్డంకుల్లేకుండా నీరు ప్రవహించేందుకు వీలుగా కాలువలను శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ(GHMC) అధునాతన టెక్నాలజీని వినియోగిస్తుంది. రోబోటిక్ టెక్నాలజీతో తొలుత సర్కిల్-12 మెహిదీపట్నం పరిధిలో పలు వరద నీటి కాలువలను పైటల్ ప్రాజెక్టుగా క్లీన్ చేసే పనులను మొదలుపెట్టింది. ఈ పనులను జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీరింగ్ (మెయింటనెన్స్) చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో స్టార్మ్ వాటర్ డ్రైన్ క్లీనింగ్ పైలట్ ప్రాజెక్ట్ గా నగరంలో ప్రారంభించామని చెప్పారు.
Also Read: Hrithik Roshan: గర్ల్ ఫ్రెండ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్.. ఎందుకంటే?
రోబోటిక్ టెక్నాలజీని వినియోగం
ఈ విధానం విజయవంతం అయితే వాటర్ డ్రైయిన్లు పొంగి పోర్లడం, ట్రాఫిక్ జామ్ లు, లోతట్టు ప్రాంతాలు ముంపు కు గురయ్యే ఘటనలు చాలా వరకూ తగ్గుతాయని చెప్పారు. సిటీలో చిన్నపాటి వర్ష వచ్చిందంటే చాలు స్టార్మ్ వాటర్ డ్రైన్ లు పొంగి పోర్లడం, ట్రాఫిక్ జామ్ లు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవ్వడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో రోబోటిక్ టెక్నాలజీని వినియోగించి, ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందని వివరించారు. అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్న రోబోటిక్ యంత్రాల ద్వారా ప్రధాన రోడ్డు క్రాసింగ్ లో వర్షపు నీటి కాలువల శుభ్రత చేపట్టారు. ఈ ప్రక్రియను రాత్రి మెహదీపట్నం ఎన్ఎండీసీ జంక్షన్ లో క్లీనింగ్ పనులను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
నూతన టెక్నాలజీ
కాలువలలోని అడ్డంకులను ఖచ్చితంగా గుర్తించి, తొలగించడం, బురదను వేగంగా, సమర్థవంతంగా అత్యంత వేగంగా తొలగించడం, వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి, డ్రైనేజ్ సామర్థ్యాన్ని పెంపొందించటమే ఈ నూతన టెక్నాలజీ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఫీల్డ్ స్టాఫ్, ప్రజల భద్రతకు ఎలాంటి హాని జరగకుండా కఠిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ క్లీనింగ్ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఈ విధానం సక్సెస్ అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్‌లలో అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నామని వివరించారు.
Also Read: MLA Donthi Madhava Reddy: చర్చనీయాంశంగా మారిన ఆ ఎమ్మెల్యే తీరు.. కారణం అదేనా..?