MLA Donthi Madhava Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MLA Donthi Madhava Reddy: చర్చనీయాంశంగా మారిన ఆ ఎమ్మెల్యే తీరు.. కారణం అదేనా..?

MLA Donthi Madhava Reddy: ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ముఖ్యమంత్రితో చనువుగా ఉంటూ పార్టీ అధిష్టానంతో దగ్గరగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు సాధించడం సర్వసాధారణం. కానీ వరంగ(Warangal)ల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే మాత్రం దానికి విరుద్ధంగా వివరిస్తున్నారు. ఎమ్మెల్యేగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా ఆయన వ్యవహారం మాత్రం నిత్యం చరచనీయంశంగా మారింది. ఆయన మంకు పట్టుతో ముఖ్య మంత్రిని కలువరు.. కనీసం రాష్ట్ర పార్టీ అధిస్థానం ను కూడ లెక్క చేయరు. నా నియోకజక వర్గానికి నేనే రాజు.. నేనే రాజు అనే చందంగా వ్యవహరిస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి(MLA Donthi Madhava Reddy) తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఆయన తీరు నియోజకవర్గ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు సైతం తలనొప్పిగా మారుతుంది.

దొంతి రూటే సఫరెట్

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూటే సపరేటుగా మారింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక దారిలో వెళుతుంటే ఆయన మాత్రం తనదైన దారిలోనే వెళుతున్నారు. జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు తమ నియోజకవర్గాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటే మాధవరెడ్డి మాత్రం మంకు పట్టుతో అభివృద్ధి రేసులో వెనకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా ప్రజలను నియోజక వర్గ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Anushka Shetty: ఖాళీ టైమ్‌లో స్వీటీ అనుష్క ఏం చేస్తుందో తెలుసా?

సీఎం ను కలవరు.. పార్టీ పెద్దలను లెక్క చేయరు

సార్వత్రిక ఎన్నికల ముందు నుండి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో విభేదిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దొంతి మాధవరెడ్డి కి గత కొంత కాలంగా కోల్డ్ వార్ సాగుతుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారత్ జూడో యాత్ర లో భాగంగా చేపట్టిన ప్రజాహిత పాదయాత్రను అడ్డుకోవడంతోపాటు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని కలవకపోవడం, ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి ని పిలవకపోవడం పట్ల సీఎం కూడా మాధవరెడ్డి పై ఆగ్రహం ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఆ మధ్య నర్సంపేట 250 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivass Reddy) ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumr Reddy) ని ఆహ్వానించి ముఖ్యమంత్రి ని పిలవకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవకపోవడం, తనకు నచ్చిన కొంతమంది మంత్రులతోనే సఖ్యతగా ఉండని ఆయన నైజం చూసి ఎత్తున చర్చ జరిగిందట. ముఖ్య మంత్రిని కలవలేదు సరే పార్టీ పెద్దలను లెక్క చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీజేపీ(BJP) అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు వివరించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) హాజరు అయ్యారు. ఈ పాదయాత్ర కు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరైతే మాధవరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశ్యం తో ,రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర నిర్వహిస్తే దానికి కూడా దూరంగా ఉండడంతో పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉందనే చర్చ సాగుతుంది.

Also Read: Police Quarters: నిరుపయోగంగా పోలీస్​ క్వార్టర్స్.. పట్టించుకోని అధికారులు

ఎందుకు ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారు

మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక రాజకీయాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గం అభివృద్ధిపై లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 250 పడకల ఆసుపత్రి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఎమ్మెల్యే విఫలమయ్యారు. ఒకవైపు రైతులు యూరియా(Urea) అందకుండా ఆందోళన చెందుతుంటే కనీసం నేనున్న అనే భరోసా కూడా ఇవ్వలేదనీ విమర్శలు వస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేషాలు నిర్వహిస్తుంటే మాధవరెడ్డి మాత్రం మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తూ ఉన్నాడని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చాలా చోట్ల చెరువులు మత్తడి పడి పొలాలు మునిగిపోయిన, వరదల వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన కూడా ప్రజల్ని కనీసం పట్టించుకోలేదనే ఆరోపిస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయి అన్నదాతలు ఆవేదనలో ఉంటే అధికారులతో కలసి ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు.

జిల్లా లోని అందరూ ఎమ్మెల్యేలు తమ నియోజక అభివృద్ధికి నిధుల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంటే మాధవరెడ్డి మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నాడు. మాధవరెడ్డి తీరు వల్ల నర్సంపేట నియోజకవర్గం చాలా నష్టపోతుందని సొంతపార్టీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. ఆ మధ్య హనుమకొండ(Hanumakonda)లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశానికి హన్మకొండలోని తన నివాసంలో ఉండి కూడా హాజరుకాలేదు. దీంతో అసలు ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎందుకిలా వ్యవహరిస్తున్నాడని అర్థం కావడం లేదని సొంతపార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తుంటే మాధవరెడ్డి మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మాధవరెడ్డి తీరువల్ల నియోజకవర్గ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read: Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం