Ponnam Prabhakar( image crediT: twitter)
Politics

Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaka) తెలిపారు.  ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి హౌజ్ లో డిఫెరెంట్ ఆఫ్ ఒపినియన్ రాకుండా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలన్నారు. కోర్టులు కోడ్ ఆఫ్ హౌజ్ పరిగణన లోకి తీసుకుంటారన్నారు. గత 10 సంవత్సరాలు అధికారం లో ఉండి బీసీ లకు,ఎంబీసీలకు బీఆర్ ఎస్ ఏం చేసిందని? ప్రశ్నించారు.

 Also Read: Mahabubabad Heavy Rains: మహబూబాబాద్ జిల్లాలో.. 43 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

బీసీ రిజర్వేషన్లపై సామాజిక న్యాయానికి సంబంధించి చరిత్రాత్మక నిర్ణయమన్నారు. బీజేపీ(Bjp) శాసన సభ పక్షం కూడా బీసీ లకు ఇవ్వలేకపోయారన్నారు. దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే రాష్ట్రం లో వచ్చిన ఐదు ఎమ్మెల్సీలు బలహీన వర్గాలకు వచ్చాయన్నారు. న్యాయ స్థానాల పట్ల తమకు ఉన్నదన్నారు. కేటీఆర్(Kcr) వ్యాఖ్యలు కోర్టుకు వెళ్ళాలి అనే ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. తమిళనాడు చెన్నై కేసు విషయంలో గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుల పై కోర్టు జోక్యం చేసుకున్నదని గుర్తు చేశారు.గతంలో ఉన్న 50 శాతం కాబ్ తొలగించాలని ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే గ్రామీణ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ తరలి వచ్చారన్నారు.

గవర్నర్ ను కలుస్తాం

ఇక గవర్నర్ దగ్గరికి వెళ్తామన్నారు. అన్ని పార్టీల నుండి ప్రతినిధులంతా వెళ్లి గవర్నర్ ను కలుస్తామన్నారు.రాష్ట్రపతి,ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతున్నామన్నారు. కానీ ఇవ్వడం లేదన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. రాష్ట్రంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని చెప్తామన్నారు. తమ విధానం చెప్తామని, తుది నిర్ణయం గవర్నర్ దే అన్నారు. న్యాయ పరంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ నిర్ణయానికి వచ్చామన్నారు.

సభలో అందరికి ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు. సుప్రీం కోర్టు రివ్యూ జరుగుతుందని,2012 లో సుప్రీం తీర్పు, రిజర్వేషన్ పరిమితి పై, అన్ని పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఉంటే ముందుకు వెళ్లవచ్చు అనేది తీర్పు ఉన్నదన్నారు. బీజేపీ,సీపీఐ, ఎంఐఎం కి గవర్నర్ ను కలుద్దామని కోరడం జరిగిందన్నారు.

 Also Read: Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం