MP Etela Rajender (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MP Etela Rajender: రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించ లేదనడం దారుణం.. ఈటల రాజేందర్

MP Etela Rajender: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధుల ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని పేర్కొనడం దారుణం అని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. శామీర్ పేట్‌లోని ఆయన నివాసంలో మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్‌తో కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ 11 సంవత్సరాల సుపరిపాలనపై మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని పేర్కొన్నారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దేశ ప్రజలు బిజెపికి పట్టంకట్టారని, ప్రజల నమ్మకాన్ని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. భారత పౌరుడు గర్వించేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేసిందన్నారు. నరేంద్రమోడీ ప్రపంచ దేశాలతో మంచి స్నేహపూరిత వాతావరణం తీసుకువచ్చారని చెప్పారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు భార్యలముందే భర్తలను చంపిన ఘటనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకారం తీర్చుకుందన్నారు. అనేక సంక్షేమ పథకాల తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి బాటలో బిజెపి ప్రభుత్వం నిలబెట్టిందన్నారు.

Also Read: KCR Ghosh Panel Interrogation: విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌ అభ్యర్థన.. కమిషన్ కీలక నిర్ణయం!

బిజెపి ప్రచారంలో వెనకబడి ఉంది. విజయరామారావు

బిజెపి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుంది గాని, చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడంలో వెనకబడి ఉందని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు అన్నారు. కుంభకోణాల్లో, దోపిడీలో అప్పటి కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నారని అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా బిజెపి ప్రభుత్వం దేశంలో పాలన సాగిస్తున్నదన్నారు. మోడీ రాకముందు దేశంలో నిరుద్యోగ సమస్య, ఆర్ధిక సమస్య బాగా ఉండేదన్నారు. ప్రధాని దేశ అభివృద్ధిలో మహిళలకు మహిళా రిజర్వేషన్, మహిళా బిల్లుతో వారిని భాగస్వాములుగా చేర్చారన్నారు.

మహిళలకు ప్రాధాన్య ఇచ్చిన పార్టీ బిజెపి

దేశంలో మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చిన పార్టీ బిజెపి పార్టీ అని బిజెపి రాష్ట్ర కార్యదర్శులు ఆకుల విజయ అన్నారు. మహిళా రిజర్వేషన్, మహిళా బిల్లుతో ప్రధాని మోడీ మహిళలకు దేశ అభివృద్ధిలో భాగం చేశారని ఆమె తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల గుండెల్లో గుబులు పుట్టించారన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మీడియా సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మాజీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి, ఉమ్మడి శామీర్ పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం, శామీర్ పేట్ మండల బిజెపి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ కౌన్సిలర్ హంస రాణి కృష్ణ గౌడ్, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Duddilla Sridhar Babu: సెమీ కండక్టర్ల తయారీ.. డిజైనింగ్ లో యువతకు శిక్షణ!

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు