KCR Ghosh Panel Interrogation (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

KCR Ghosh Panel Interrogation: విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌ అభ్యర్థన.. కమిషన్ కీలక నిర్ణయం!

KCR Ghosh Panel Interrogation:  కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభించిన క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని కేసీఆర్.. కమిషన్ ఛైర్మన్ కు కేసీఆర్ తెలిపారు. ఓపెల్ హాలులో ఫేస్‌ టూ ఫేస్ విచారణ కాకుండా.. వ్యక్తిగతంగా వన్ టూ వన్ ఇన్ కెమెరా విచారణను కోరారు. ఆయన కోరికను మన్నించిన పీసీ ఘోష్.. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు. ప్రస్తుతం కేసీఆర్ ను వన్ టూ వన్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కు పలు కీలక ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలను సైతం కచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కేసీఆర్‌ను అడుగుతున్న ప్రశ్నలు ఇవేనా?
1. కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో మీ పాత్ర ఏంటి?

2. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణం ఏంటి?

3. ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎందుకు చెల్లించారు?

4. కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు ఆమోదించారు?

5. మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది?

6. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉందా?

7. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా?

8. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణ వద్ద రాతి పునాది ఉందా?

9. మేడిగడ్డ ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు?

Also Read: Teenmaar Mallanna: దళిత ఎమ్మెల్యేలే టార్గెట్.. మీడియా ముసుగులో మల్లన్న దందాలు!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..