Bhadradri Kothagudem: పాల్వంచ కేటీపీఎస్(KTPS) అంబేత్కర్ సెంటర్ నందు గత 99 రోజులుగా నిర్మాణ కార్మికులు తమకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలనీ టెంట్ వేసి నిరాహార దీక్షచేపట్టారు. ఐనా నేటికీ ప్రభుత్వం గాని, జెన్కో యాజమాన్యం గాని, ప్రజా ప్రతినిధులు గాని నేటికీ స్పందించక పోవడం దుర్మార్గం. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తికూడా చూడడం లేదు. మా సమస్యలు తిరేడెన్నడు మాకు న్యాయం జరిగేదెన్నడు అంటూ తమ గోడును వినిపిస్తున్నారు.
ఈ సందర్బంగా పలువురు స్వేచ్ఛ ప్రతినిధితో మాట్లాడుతూ 2008న 6వ దశ నిర్మాణం చేపట్టి 2018 లో నినర్మానం పూర్తి చేసామని, అనంతరం మమ్ములను తొలకించారు. ఆనాడే ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున ధర్నాచేయడంతో 7వ దశ నిర్మాణంలో కచ్చితంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. ఆనాటి నుండి నేటికీ 17సంవత్సరాలుగా ఉపాధి కల్పించాలని పోరాటం చేస్తున్నామని నేటికీ తమ సమస్యలుపరిస్కారం కాలేదని తెపారు. పాల్వంచ కేటీపీస్(KTPS) ప్రభావిత ప్రాంతాలైన కరకవాగు, పునుకుల, పుల్లయ్య గూడెం, పాండురంగాపురం వాసులమైన మేము భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(Bhadradri Thermal Power Station) పాల్వంచ కేటీపీస్(KTPS) 6వ దశ కర్మాగారం నిర్మాణంలో 450 మంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు శ్రమించి పని చేశామని అన్నారు. కర్మాగారం పూర్తై ప్రారంభించిన అనంతరం మమ్ములను అర్ధంతరంగా పనులనుండి తొలగించారని ఆవేదన చెందారు. కార్మిక చట్టాలను సైతం తుంగలో తొక్కి మా బతుకులు ఛిద్రం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఐటీడీఏ పి ఓ దరఖాస్తు పెట్టి ఉన్నాం
ఆనాడే కాంట్రాక్టు లేబర్ కింద కేటీపీస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించాలని ధర్నా చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఐటిడిఏపిఓ(ITDAPO)ని కలిసి తమ గోడును విన్నవిస్తూ పిర్యాదు చేశామని అన్నారు వారు స్పందించి. వెంటనే అప్పటి సిఈ కి లిఖిత పూర్వకంగా లేఖ రాశారని ఆ లెక్కలో 6వ దశ కర్మాగారంలో ఏ ఏ కంపిని కింద ఎంతమంది ఏ ఏరియాల నుండి పని చేసారు సమగ్రంగా ఎంక్వైరి చేసి వారి వివరాలను కోరుతూ న్యాయంగా పని చేసిన వారికీ గ్రామసభలు నిర్వహించి ఉపాధి అవకాశం కల్పించాలని వారు తెపారు. పని చేసిన వారిని పక్కన పెట్టి జెన్కో(Jenco) అధికారులు పైసలు ఇచ్చినోడికి పట్టం కట్టి మాకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
Also Read: Pashamylaram Blast: పాశమైలారం ఘటన.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించాము
కష్టపడ్డ వారిని పక్కన పెట్టి పైసలు ఇచ్చినోడికే పబ్బం కట్టి మాకు తీవ్ర అన్యాయం చేసారని హ్యూమన్ రైట్స్ కమిషన్(Human Rights Commission) ఆశ్రయించామని అన్నారు. వారుకూడా జెన్కో యాజమాన్యంను కార్మికులకు న్యాయంచేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశాలు జారిచేసినప్పటికి జెన్కో(Jenco) యాజమాన్యం నిర్లక్యపు ధోరణి ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేసారు.
అజ్మీరాశారద మాటాడుతూ
కెటిపిఎస్ 6వ దశ కర్మాగారంలో ప్రాణాలకు తెగించి పని చేశాను నేటికీ మా సమస్య పరిస్కారం కాలేదు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ ఉపాధి కల్పించక పోవడంతో మా బ్రతుకులు రోడ్డున పడ్డాయాని ఆవేదన వ్యక్తం చేసారు. కేటీపీస్ నుండి వేలువడే వ్యర్థ వాయువులను పిలుస్తూ రోగాల బారిన పడుతున్నామని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిదులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు.
తడికమల్ల వసంత మాట్లాడుతూ
కేటీపీఎస్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న మాకు 6వ దశ శర్మగారంలో పని కల్పించి ఈరోజు అ అర్ధాతరంగా తీసివేయటంతో మా బతుకులు రోడ్డు మీద పడిన ఇస్తారాకుల వలె మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ 99 రోజులుగా ఉపాధి కల్పించాలని ధర్నా చేస్తున్నప్పటికీ నేటికీ ప్రభుత్వం గానీ జెన్కో యాజమాన్యం గాని స్పందించకపోవడం. చాలా దుర్మార్గం ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి తిరిగి మరి ఓట్లను అడిగి వేయించుకున్న ప్రజాప్రతినిధులు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి నేడు మరిచారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఉపాధి కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నామని తెపారు.
గుగులోతు పద్మ మాట్లాడుతూ
కేటీపీఎస్(KTPS) ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తూ ఉపాధి కోల్పోయి నేటికీ 17 సంవత్సరాలు అయినా కూడా జెన్కో యాజమాన్యం గాని ప్రభుత్వంగాని ప్రజాప్రతినిధులుగాని, నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గత 99 రోజులుగా కేటీపీఎస్ కర్మాగారం ముందు నిరాహార దీక్ష చేస్తున్న ఏ ఒక్కరు స్పందించి సరైన హామీ ఇవ్వలేదని. ఇది ఇలాగే కొనసాగితే. ముందు ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మాకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని కోరారు.
నూకల సతీష్ కుమార్ కార్మికుడు
కేటీపీస్ 6దశ నిర్మాణంలో పని చేసిన మమ్ములను అప్పటి టిఆర్ఎస్(BRS) ప్రభుత్వం మా జీవితాలను ఆగం చేసింది, ఎలక్షన్స్ ముందు తప్పకుండా ఉపాధి కల్పిస్తామన్న నాయకుల మాటలు నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామసభలు నిర్వహించి పనిచేసిన వారిని పక్కన పెట్టి పనిచేయని వారికీ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు సిఎల్(CL) ఉద్యోగం చేస్తున్నారని, అక్కడ కూడా రాజకీయం చేసి లక్షల రూపాయలు చేతులు మారాయని. మాకు అన్యాయం చేసారని ఆరోపించారు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి మాకు ఉపాధి కల్పించి మా బ్రతుకులలో వెలుగులు నింపాలని ఈ సందర్బంగా కోరుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం మాకు గట్టి హామీ ఇచ్చేంత వరకు మేము దీక్షను విరమించేది లేదని లేని పక్షంలో ఆమరణ నిరహర దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Also Read: Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం!