Farmers Protest (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Farmers Protest: రోడ్లపై నాట్లు వేస్తూ నిరసన.. అడుగడుగునా సమస్యలే!

Farmers Protest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది. గ్రామాల్లో ఏమైనా సమస్యలున్నా చెప్పుదామంటే అధికారులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచ మండలపరిధిలోని 36 గ్రామ పంచాయితీలలో ఇదే తంతు కొనసాగుతుంది. పాండురంగాపురం తండా పంచాయతీలో రోడ్లపై నాట్లు వేస్తూ ప్రజలు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఇది. సరైన డ్రైనేజీ(Drynage)లు లేకపోవడంతో వర్షపు నీళ్లు, చెత్త చెదారం రోడ్ల పైనే నిలిచిపోవడంతో కంపు కొడుతుంది అంటూ పలుగ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీల్లో అడుగడుగునా సమస్యలే
పాల్వంచ మండలం పాండురంగాపురం తండా గ్రామ పంచాయతీ లో ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసిన చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారు. గ్రామాల్లో వీధి దీపాలు చాలా రోజుల నుంచి వెలగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
మండలంలోని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటు పడింది. పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీరు, వీధి దీపాలు తదితర సమస్యలపై అధికాలు పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు సూన్యం కనీసం శానిటేషన్ కూడా జరగడం లేదు. వర్షం నీళ్లు ఇంట్లో, రోడ్ల మీద ఆగిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో విష జ్వరాలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎప్పటికైనా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆయా గ్రామాలలో కాంట్రాక్టర్(Contractor) లు కొంత మేరకే డ్రైనేజీ నిర్మాణం చేసి కొంత బాగాని వదిలేసిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ గారు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: BC Reservation Bill: ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లకు బీజేపీ విరుద్దం: కిషోర్ రెడ్డి

నిధులు లేక ఇబ్బందులు
గ్రామ పంచాయతీల నెలనెల రావల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ కాక పోవడంతో గ్రామ పంచాయతీల నిర్వాహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామ పంచాయితీలలో అభివృద్ధి రోజు రోజుకు దిగజారుతుంది. నిధులు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది. గ్రామపంచాయితీలకు రావాల్సిన నిధులను ప్రతి నెల జమచేసి గ్రామాలలో నెలకకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ
గ్రామపంచాయితీలలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని చెప్పవచ్చు ఎడతెరిపిలేకుండా వర్షలు కురవడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమతం చేయడంలో అధికారుల పర్యవేక్షణ నిల్ అని, వరదల ప్రభావిత ప్రాంతాలలో గ్రామాల రాకపోకలకు అంతరాయం జరిగే గ్రామాలను ముందస్తుగా గుర్తించడం, గ్రామాలలోని సమస్యలు తెలుసుకొని మందస్తు చర్యలు తీసుకోవడం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, అధికారులు గ్రామాలకను సందర్శించడం లేదు అని కేవలం ఆఫీస్ లకే పరిమితం అవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆఫీస్‌లకే పరిమితం కాకుండా లోతట్టు ప్రాంతాలను సందర్శించి వరదల ప్రభావితం ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తంచేసి అవసరమైన సహాయక చర్యలు తీసుకొని గ్రామపంచాయితీలలో విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పారిశుధ్య పనులు వేగవంతంచేయాలనీ పలు గ్రామ పంచాయితీ ప్రజలు కోరుతున్నారు.

Also Read: Parliament: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్‌’పై చర్చ.. ముహూర్తం ఫిక్స్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!