Asha Worker Award: ఉత్తమ సేవ ఆశా వర్కర్ అవార్డు పురస్కరించుకొని సొయం జయమ్మ మరియు సిఓ నాగమణికి చిరు సన్మానంతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జిఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,డాక్టర్ బి.హరీష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండలం గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా ఆశ వర్కర్ సర్వీస్లు అందిస్తున్న సోయం జయమ్మ గారికి ఫ్రంట్ లైన్ వారియర్ అస్పిరేషనల్ డిస్టిక్ & బ్లాక్ ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా ఆశ అవార్డు అందుకోవటం చాలా గర్వకారణం.
Also Read: OG Movie BGM: ‘ఓజీ’ కోసం ప్రాణం పెడుతున్న థమన్.. ఆస్కార్ రేంజ్‌లో మ్యూజిక్
అంకితభావంతో వైద్య సేవల కృషి
ఈ సందర్బంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి డాక్టరు మరియు స్టాప్ ఇంచార్జ్ నాగమణి గార్ల ఆధ్వర్యంలో అంకితభావంతో వైద్య సేవల కృషికి ఉత్తమ ఆశ అవార్డు రావడం పట్ల మీ వైద్య సిబ్బంది సభ్యులు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూన్నా మని అన్నారు. గతంలో కరోనా టైంలో కూడా ఉత్తమ సేవ అవార్డులు మన గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందించిన వైద్య సేవలకు గుర్తింపు మీ అంకిత భావంతో మీరు చేసిన కృషి వైద్యసేవలు కారణమని గుర్తు్చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవ సౌకర్యాలు
గ్రామీణ ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవ సౌకర్యాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బి. హరీష్ గారు, ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణగారు,కోరేం రమేష్ గారు నాగమణి, ఆశ వర్కర్ సోయం జయమ్మ, సంధ్య,సోడే మధు, వంశీ, సందీప్, గణేష్,రాధా,అచ్చమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్టాప్ సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.
Also Read: CPI Narayana: బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు