CPI Narayana: ప్రజా ధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) డిమాండ్ చేశారు. హైదరాబాద్ మఖ్ధూం భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశంలో కల్వకుంట్ల కవిత(kavitha) చేసిన వ్యాఖ్యలను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని హరీశ్ తప్పుకున్నప్పటికీ, కేసీఆర్(KCR) మాత్రం బాధ్యతగా సమాధానం చెప్పాలన్నారు. లేదంటే కవిత ఆరోపణలు వాస్తవంగా భావించాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్(BRS) అంతర్గత వ్యవహారాలు తమకు సంబంధం లేదని, కానీ టీఆర్ఎస్ మొదటి నుంచి ఆ పార్టీలో క్రీయశీలకంగా ఉన్న కవిత స్వయంగా నిర్ధిష్టమైన అవినీతి ఆరోపణలు చేశారని, ఇది ప్రజా సొమ్ముకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. బీజేపీ తో పొత్తు ఉండడం వల్లే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించలేదన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయం
ఉపరాష్ట్ర పతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) కి ఓటు వేయకపోతే బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య అవగాహన ఉందనుకోవాలన్నారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir), తమిళనాడు(Tamil Nadu) , మహారాష్ట్ర(Maharashtra) లో పొత్తులు పెట్టుకొని బీజేపీ కుటుంబాలను చీల్చిందని ఆరోపించారు. తెలంగాణలో లిక్కర్ కేసు అంటూ కవితను జైలుకి పంపించారన్నారు. చివరకు కవిత సొంత పార్టీ పెట్టుకునేలా పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో పాటు బీహార్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 9దేళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ(GST) స్లాబులను తగ్గించిందని విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్ ను సంస్కరించాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకమైన అన్ని దేశాలనూ కలుపుకున్నప్పుడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) దిగొస్తారని ప్రధాని మోదీ(Modhi)కి సూచించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ ఓటు వేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని అనుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ నెల 21 నుంచి 25వ వరకు పంజాబ్ లో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయని, ఈ సభలో జాతీయ రాజకీయ, ఇతర పలు అంశాలపై చర్చించనున్నట్టు వివరించారు.
Also Read: CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?
సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ గత ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలుగు వ్యక్తి అని వెంకయ్యనాయుడు(Venkaiah Naidu)కు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్(BRS) ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగువ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా?, లేదా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ విలీనం అవుతందా? ఉంటుందా? కబళించ బడుతుందా? అని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత కీలక సమయంలో ఇప్పటికైనా బీఆర్ ఎస్ స్పష్టత ఇవ్వాలన్నారు. కమ్యూనిస్టులుగా తాము అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల పక్షాన నిలబుడుతామని, బీఆర్ఎస్ కూడా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. బీజేపీని నమ్ముకుంటే దెబ్బతింటారని హెచ్చరించారు.
విద్యుత్ బిల్లుల ఖర్చు
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్ తిరిగి చేపట్టాలని, 5వ ప్యాకేజీ వద్ద చిన్న ఎత్తిపోతలను నిర్మించాలని సూచించారు. సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఉపయోగిస్తారా? లేదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఈ బ్యారేజీలను ఉపయోగిస్తే రూ.14వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఖర్చు అవుతుందని వివరించారు. రూ.36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత -చేవేళ్ల ప్రాజెక్ట్ జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ప్రకారం రూ.1,46,000 కోట్ల అంచనాలు పెరిగాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ఏదో పద్ధతిలో ఆర్థిక లాబాలు, దుర్వినియోగం జరిగిందని, కేవలం ఇద్దరు, ముగ్గురు అధికారుల వద్దనే వెయ్యి కోట్ల రూపాయలు దొరికాయని తెలిపారు. యూరియా(Urea) డిమాండ్ పై ముఖ్యమంత్రి వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి పిలుపునివ్వాలని సూచించారు.
Also Read: Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ