Viral-News
Viral, లేటెస్ట్ న్యూస్

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Leaves denied: మన దేశంలో పెళ్లిళ్లకు విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబంలో ఒక పెద్ద పండుగ మాదిరిగా వేడుకలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా, అనాదికాలంగా వస్తోంది. మరి సొంత ఇంట్లో జరిగే పెళ్లికి లీవ్స్ దొరక్కపోతే (Leaves denied) ఎవరికైనా కోపం రాదా?!. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయ మహిళకు కూడా ఆగ్రహం కట్టలుతెంచుకుంది. సొంత బ్రదర్ పెళ్లికి సెలవులు ఇవ్వకపోవడంతో పనిచేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసింది. తన సోదరుడి పెళ్లికి సెలవు కోరగా కంపెనీ తిరస్కరించిందని, అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ‘రెడిట్’ పోస్ట్‌లో ఆమె వెల్లడించింది.

15 రోజులు అడిగాను..

అమెరికాలో జరిగే తన తమ్ముడి పెళ్లికి తప్పకుండా హాజరవ్వాలని, అందుకోసం 15 రోజులపాటు సెలవు కావాలంటూ మూడు వారాల ముందుగానే అప్లికేషన్ పెట్టుకున్నానని ఆమె చెప్పారు. అయితే, ‘పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఉద్యోగానికి రిజైన్ చేయాల్సిందేనని కంపెనీ వాళ్లు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ‘‘15 రోజులు సెలవు కావాలని 3 వారాల ముందుగానే సమాచారం ఇచ్చాను. కానీ, కంపెనీ నా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. పెళ్లికి వెళ్లాలనుకుంటే ఉద్యోగం వదులుకోండి’ అంటూ కంపెనీ బదులిచ్చిందని వివరించారు.

సెలవు పెట్టాలనుకున్న రోజుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించినా, కంపెనీ మొండిగా వ్యవహరించిందని ఆమె వివరించారు. సదరు కంపెనీలో గత నాలుగు సంవత్సరాలు అంకితభావంతో పని చేశానని, అవసరమైనప్పుడు ఓవర్ టైం కూడా చేశానని ఆమె ప్రస్తావించారు. కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు తక్కువ జీతం తగ్గించుకొని పనిచేసి సహకరించానని ఆమె తెలిపారు. కానీ, చివరకు చేతిలో మరో ఉద్యోగావకాశం కూడా లేకుంాడనే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. చివరిగా.. నోటీసు పీరియడ్‌ను పాటించాలంటూ బలవంత పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు.

Read Also- Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

తనకేమీ పెద్దగా ఆర్థిక బాధ్యతలు లేవని, తన జీవనాధారం కూడా పెద్ద సమస్య కాదని, అయితే, తన నిర్ణయం సరైనదా?, కాదా? అనే తెలుకునేందుకు రెడిట్‌లో పోస్టు పెడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. సదా అండగా ఉండే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి, కీలక సమయంలో మద్దతుగా నిలవని కంపెనీని వదిలిపెట్టడం సరైన నిర్ణయమేనా? అనే సందేహం తనను వెంటాడుతోందని ఆమె పేర్కొన్నారు. ఆ యూజర్ పోస్టుపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. చాలామంది కంపెనీ మొండివైఖరిని తప్పుబట్టారు. కుటుంబాన్ని ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న ఆమెను ప్రశంసించారు.

Read Also- CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

‘‘నువ్వు ఉద్యోగాన్ని వదిలి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, నిన్ను గౌరవించని సంస్థను వదిలి మానసిక ప్రశాంతతను ఎంచుకున్నావు. వాళ్లు నిన్ను ఒక వస్తువులా మాత్రమే చూశారు. ఇవాళ నీ సోదరుడి పెళ్లి కావొచ్చు, రేపు నీ ఆరోగ్య సమస్యైనా కావొచ్చు. ఏదైనా వాళ్లకు పట్టదు. నీ నిర్ణయం 100 శాతం సరైనదే’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. మరో యూజర్ స్పందిస్తూ, కుటుంబం కంటే పనికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వకూడదని అన్నారు. ‘‘జీవితంలో దేన్నైనా, ఎవర్నైనా మార్చుకోవచ్చు. కానీ, ఎప్పటికీ మారనిది కుటుంబం మాత్రమే. భవిష్యత్తులో కూడా, కుటుంబం కోసం ఉద్యోగాన్ని వదలాల్సి వస్తే ఏం ఫీల్ కావొద్దు’’ అని రాసుకొచ్చారు. మరొక యూజర్ స్పందిస్తూ.. ‘‘ఉద్యోగాలు పోతే వస్తాయి. కానీ, కుటుంబం, బంధాలు ఒక్కసారి పోతే తిరిగి రావు. 4 సంవత్సరాలపాటు ఒక కంపెనీలో పనిచేయడం అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మీ మార్పునకు ఇంతకుమించిన సమయం లేదు’’ స్పందించారు. ఈ ఘటనతో కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి, ఉద్యోగుల వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఏమిటనే అంశంపై విస్తృత చర్చ మొదలైంది.

 

Just In

01

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే