CV Anand: గంగా జమున తెహజీబ్ కు ప్రతీక అయిన హైదరాబాద్(Hyderabad) లో జరిగే ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలేనని కమిషనర్ సీ.వీ.ఆనంద్(CV Anand) అన్నారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఇలా ప్రతీ పండుగలో లక్షలాది మంది పాల్గొంటారని చెప్పారు. ముందస్తు ప్రణాళిక, సమర్థ కార్యాచరణ, పకడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేసినపుడే శాంతిభద్రతలను కాపాడగలమన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న 170మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను సందర్శించారు.
Also Read: Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!
ప్రశాంతంగా జరిగేలా చూడటం ఛాలెంజ్
ఈ సందర్భంగా సీపీ ఆనంద్(CV Anand) పదేళ్లుగా హైదరాబాద్ లో తాను పని చేసిన అనుభవాలను పంచుకున్నారు. తాను గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని చెప్పారు. పోలీస్ కమిషనర్‌గా నాలుగోసారి అని తెలిపారు. భిన్న మతాలు, సంస్కృతులకు ఆలవాలమైన హైదరాబాద్ దేశంలోని సున్నితమైన నగరాల్లో ఒకటని చెప్పారు. అందుకే ప్రతీ పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడటం ఛాలెంజ్ గా ఉంటుందన్నారు.
పండుగల సందర్భంగా తొక్కిసలాటలు జరగకుండా అమలు చేస్తున్న చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్‌లైన్ అనుమతి ఫారాలు, విగ్రహాలకు జియోట్యాగింగ్, డ్రోన్‌లు, యాప్‌లు, సీసీ కెమెరాల వాడకం, మల్టీ-ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నామో వివరించారు. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు రామ్ నివాస్ సేపట్, కల్మేశ్వర్ సింగేన్వార్ శ్రీమతి పుష్ప తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జనం ప్రశాంతం.. డీజీపీ
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్(DGP Dr. Jitender) చెప్పారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందని.. నాలుగు గంటల్లోపు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ వివరించారు. రాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. త్వరగా నిమజ్జనం పూర్తి కావటానికి ప్రజలు సహకరించాలని కోరారు. డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్ లోని ఐసీసీసీ లో కంట్రోల్ రూం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నిమజ్జన యాత్రాలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
Also Read: CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. అందుకోసమేనా..?
సీబీఐ డైరెక్టర్ కు అస్వస్థత అపోలో ఆస్పత్రిలో చికిత్స
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sood) అస్వస్థతకు లోనయ్యారు. దాంతో ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్రవీణ్ సూద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసు గురించి చర్చించినట్టు తెలిసింది. సమావేశం తర్వాత ఆయన దైవ దర్శనార్థం శ్రీశైలం వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరగానే అపోలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. అయితే, ప్రవీణ్ సూద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలిసి పలువురు సీబీఐ అధికారులు హాస్పిటల్ వెళ్లి ఆయనను పరామర్శించారు.
Also Read: Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు