OG Movie BGM: తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా గురించి ఏ రేంజ్ లో హైప్ జరుగుతోందో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన హంగ్రీ చీతా సంచలనం సృష్టించింది. ఫైర్ స్ట్రోమ్ ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటింది. దీనిని దృష్టిలో పెట్టుకుని సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం తను నుంచి ఏం చేయాలో అంతా చేస్తున్నారు. విడుదలైన రెండు పాటలు దుమ్ములేపుతున్నాయి. తాజాగా థమన్ మరో పోస్ట్ ఈ సినిమా పై ఉన్న హైప్ ను మరింత పెంచుతోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో థమన్ ఓజీ సినిమాతో గ్యాంగ్ స్టర్ అంటే ఏంటో తమిళ వాళ్లకి తెలిసేలా ఉంటుందని బలంగా చెప్పారు. దీనికి ఆజ్యం పోసేలా థమన్ చేసిన పోస్ట్ ఫ్యాన్ ను ఉర్రూతలూగిస్తుంది. అందులో ఏం ఉందంటే.. ఓజీ సినిమా కోసం 117 మందితో బీజీఎం కంపోజ్ చేయిస్తున్నారని తెలుస్తుంది. అది కూడా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మ్యూజిక్ కంపోజింగ్ స్టూడియోలో. దీంతో ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. యూఎస్ ప్రీ బుకింగ్స్ లో ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. తాజాగా థమన్ ఈ స్థాయి సంగీతం అందించడంతో మరో రికార్డు కొట్టడం ఖాయమే అంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమా బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ కోసం ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ‘అబ్బే రోడ్’ స్టూడియోలో బీజీఎం కంపోజ్ చేస్తున్నారు. ‘అబ్బే రోడ్’ అనేది లండన్, ఇంగ్లండ్‌లో ఉన్న ప్రసిద్ధ రికార్డింగ్ స్టూడియో. ఇది 1931లో ప్రారంభమైంది. బిటిల్స్ (Beatles) బ్యాండ్ లెజెండరీ ఆల్బమ్ ‘అబ్బే రోడ్’ (1969) ఇక్కడే రికార్డ్ చేశారు. పింక్ ఫ్లాయిడ్, పాల్ మెక్‌కార్ట్నీ వంటి గ్రేట్ మ్యూజిక్ లెజెండ్స్ ఇక్కడ పని చేశారు. ఇది ఒస్కార్ విన్నర్ స్కోర్‌లు, ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. తమన్ ట్వీట్ ప్రకారం, #HungryCheetah BGMను ‘అబ్బే రోడ్’ స్టూడియోలో 117 మంది ఫ్యూచరిస్టిక్ మ్యూజికియన్స్‌తో రికార్డ్ చేశారు. “ఫ్యూచరిస్టిక్” సౌండ్స్ కంపోజ్ చేసేందుకు ఇది ఒక “గిగాంటిక్” గా ఉంటుంది. ‘అబ్బే రోడ్’లో ఇలాంటి భారీ రికార్డింగ్ చేయడం తమన్ కెరీర్‌లో ఇదే మొదటి సారి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ స్థాయి క్వాలిటీ ఉంటుందని తెలుస్తోంది.
Read also-TSUTF Demands : టెట్ పై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని ఉపాద్యాయులు డిమాండ్!
“ఓజీ” (They Call Him OG) పాన్-ఇండియా యాక్షన్-థ్రిల్లర్ సినిమా, పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా గురించి సుజిత్ ఈ సారి దుల్లగొడుతున్నాం అని కూడా చేప్పారు. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలవుతుంది. ఇందులో పవన్ “ఓజస్ గంభీర”గా కనిపిస్తున్నారు. ఇమ్రాన్ హాష్మీ (విలన్), ప్రియాంక మోహన్ (హీరోయిన్), ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి నటలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. థామన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ మూవీస్ నిర్మాణంలో, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ చేయనున్నారు.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025