Warangal District: గీతాసారం ప్రతి మనిషి జీవన గమనానికి మార్గనిర్దేశం చేస్తుంది. ధర్మం బోధించి సువిధమైన జీవన విధానం చూపుతుంది. ధర్మం వైపు నిలిచాడు కాబట్టే కృష్ణా తత్వం ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనీ గీతాసారం చెబుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ ఆధ్యాత్మిక నగరం ఓరుగల్లులో రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు(Krishna Janmashtami celebrations) ఘనంగా నిర్వహించారు.
హనుమకొండ(Hanumakonda) జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్.సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించారు.
న్యాయం వైపు నిలిచాడు
జానపద కళాకారుల ప్రదర్శన, మహిళల బోనాలతో హనుమకొండలోని గోకుల్ నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు వేలమందితో శ్రీ కృష్ణుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. రెండువేల మంది గొల్ల కురుమల యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలకు హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, న్యాయం వైపు నిలిచాడు కాబట్టే శ్రీకృష్ణుడు ఆనందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహాభారతం, భగవద్గీత పవిత్రమైనవి ఇవి ఒక మతానికి చెందినవి కావు అందరి ఇండ్లలో ఉండదగినవి ఆచరించవలసినవి అన్నారు. గొల్లపూడి యాదవులు శ్రీకృష్ణుని వారసంగా ధర్మం వైపు నిలువాలని పిలుపునిచ్చారు. దేశ ఔన్నత్వన్ని కాపాడడంలో ముందు నిలువాలన్నారు. పాడి సంపద వృద్ధి తోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుంది. అందుకు గొల్ల కురుమాలు యాదవులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
Also Read: Meenakshi Chaudhary: వరుసగా మూడోసారి సంక్రాంతి బరిలో.. ఈసారి మాత్రం స్పెషల్ ఇదే!
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు యాదవ గొల్లకురుమల సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్((Warangal)) జిల్లాలోని జనగాం(Jangaon), మహబూబాబాద్(Mehabubabad), ములుగు(Mulugu), జయశంకర్ భూపాలపల్లి(Jayashankbupala Pally), వరంగల్(Warangal), హనుమకొండ(Hanumakonda) జిల్లాలకు చెందిన గొల్లకురుమలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వాములు అయ్యారు.
ఈ సందర్భంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్ రాజ్ యాదవ్(Sundar Raj Yadav) మాట్లాడుతూ తెలంగాణలో మూడో సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపి ధర్మ పరిరక్షణకు రక్షణ కవచంగా నిలిచి భగవత్ బంధువుడిగా నిలిచిన శ్రీక్రుష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడని, ఆ పరమాత్ముడి డీఎన్ఏ, మా డీఎన్ఏ(DNA) ఒక్కటే నని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. దేశంలోనే అతి విశిష్టమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్మాణ ఘనత యాదవులదయితే, కలియుగ క్షేత్రం తిరుమల తిరుపతిలో తొలి దర్శనం యాదవులదే కావడం, గొల్కొండ కేంద్రంగా రాజ్యపాలన చేయడం ఈ జాతి విశిష్టతకు అద్దం పడుతోందని అన్నారు.
గొల్లకురుమల ఐక్యత
సమాజ గమనంలో గొల్లకురుమల ఐక్యత అత్యవసరమైందని, అన్ని వర్గాలతో మమేకమవుతూ హైందవ సంస్క్రుతిని, గొల్లకురుమల సాంస్క్రుతిక వైభవాన్ని మేళవించి భావి సమాజ నిర్మాణానికి పునాది వేయాల్సిన పరిస్థితి ఆవశ్యమైందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం విజయభాస్కర్, ఎం. ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్,గొర్రెల, మేకల పెంపకందారుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీజేపీ నాయకులు రావు పద్మారెడ్డి, గంటా రవికుమార్, అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు కెంచ కుమారస్వామి, కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్,అశోక్, సినీ, టీవి కళాకారులు కోమలి, మల్లిక్ తేజ, యశోద, నక్క శ్రీకాంత్, అనిత,లావణ్య,మౌనిక యాదవ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు.
Also Read: Nagaland Governor Died: తీవ్ర గాయాలతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత