Meenakshi Chaudhary
ఎంటర్‌టైన్మెంట్

Meenakshi Chaudhary: వరుసగా మూడోసారి సంక్రాంతి బరిలో.. ఈసారి మాత్రం స్పెషల్ ఇదే!

Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పేరే వినిపిస్తుంది. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా.. అందరి హీరోలతో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది. అలాగే గ్లామర్ ప్రదర్శనలోనూ తనకు తిరుగులేదనే టాక్‌ని సొంతం చేసుకుంది. వెంకటేష్, మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి.. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ వంటి వారి చిత్రాలలోనూ నటించి.. అందరితో చేయడానికి రెడీ అనేలా సంకేతాలు పంపింది. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ని కూడా సొంతం చేసుకుంది. కాకపోతే సక్సెస్ కంటే పరాజయాలే ఈ భామకు ఎక్కువగా ఉండటం విశేషం. అందుకే రేసులో కాస్త వెనుక పడింది.

Also Read- Coolie OTT: రజినీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మొన్నటి వరకు టాలీవుడ్‌ను రష్మికా మందన్నా, పూజా హెగ్డే రూల్ చేశారు. పూజా హెగ్డే కోలీవుడ్‌ని నమ్ముకుని, టాలీవుడ్‌‌లో సినిమాలు చేయడం లేదు. రష్మికా పాన్ ఇండియాను ఏలుతోంది. టాలీవుడ్‌లో ఆమె రేర్‌గా సినిమాలను ఓకే చేస్తుంది. అందులోనూ ఇప్పుడామె లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతోంది. వీరిద్దరూ అందుబాటులో లేరంటే.. నెక్ట్స్ ఆప్షన్ శ్రీలీల లేదంటే మీనాక్షి చౌదరి. కాకపోతే, తనకు వచ్చిన పరాజయాలతో.. ఇప్పుడు ఏది పడితే అది చేయకుండా, కంటెంట్‌ ప్రాధాన్యత ఉన్న చిత్రాలే చేయాలని మీనాక్షి ఫిక్సయినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకే, ఎడాపెడా సినిమాలు ఓకే చేయకుండా, చూసి చూసి జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటుందట. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి రెండు సినిమాలు మినహా.. పెద్దగా అవకాశాలు లేకపోవడానికి కారణం ఇదే. ఇలా ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా కూడా.. ఇప్పుడో రేర్ రికార్డ్ ఆమె ఖాతాలో చేరబోతుంది.

Also Read- Pooja Hegde: ప్రభాస్‌కు గురి పెట్టిన పూజా హెగ్డే.. పెద్ద స్కెచ్చే వేసిందిగా!

అదేంటంటే.. సంక్రాంతి (Sankranthi) హీరోయిన్‌గా ఆమెకు ఇప్పటికే పేరు పడింది. 2024 సంక్రాంతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి, 2025 సంక్రాంతికి వెంకటేస్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Ki Vastunnam)తో వచ్చి బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వరసగా మూడోసారి, అంటే రాబోయే సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి సరసన చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో రాబోతుంది. దీంతో వరుసగా మూడు సంక్రాంతి ఫెస్టివల్స్‌ని కవర్ చేసిన హీరోయిన్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఇటీవలే ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతికి విడుదల అంటూ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి.. ఈ సినిమాలో మొదట శ్రీలీల అనుకున్నారు. నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ జరిగి, షూటింగ్ డిలే కావడంతో శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో మీనాక్షిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమా మీనాక్షికి చాలా స్పెషల్ కాబోతోంది. ఎందుకంటే, ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో ఆమె సెకండ్ లీడ్ మాత్రమే చేసింది. కానీ, ఈసారి రాబోయే చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్. ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల మెయిన్ లీడ్‌గా చేయగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రెడిట్ మొత్తం ఐశ్వర్య రాజేష్ లాక్కెళ్లిపోయింది. ఇప్పుడు రాబోయే ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో సోలో హీరోయిన్‌గా చేసే ఛాన్స్ మీనాక్షిని వరించింది. మరి, ఈ సినిమా ఆమెకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. తెలియాలంటే మాత్రం రాబోయే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు