MLA Kadiyam Srihari: మొంథా తుఫాన్ తో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు భరోసా ఇవ్వాలని, వరదలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్(Collector Rizwan Bhasha Sheikh), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) అధికారులను ఆదేశించారు. శనివారం జనగామ కలెక్టరెట్‌లో జిల్లా అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం చేకూరింది. దీంతో సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులను తుఫాన్ ప్రభావం ఏమేరకు ఉందో అడిగి తెలుసుకున్నారు. రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, రవాణ సౌకర్యాలు నిలిచిపోయిన రూట్లు, పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లు, పూర్తిస్థాయిలో తెగిపోయిన రోడ్ల పరిస్థితిని రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయా..
ఇక పత్తి(Cotton), మొక్కజొన్న, వరి(Pady), ఇతర పంటలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి. ధాన్యం ఎక్కడ తడిసింది. తిడిసిన ధాన్యం పరిస్థితి ఏమిటి, మిల్లుకు తడిసిన ధాన్యాన్ని తరలించారా లేదా, తరలిస్తే ఎంతమేరకు తరలించారు, రైతులకు నష్టం లేకుండా చూసారా లేదా అని వ్యవసాయ, పౌరసరఫరాలు, హర్టికల్చర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడ విరిగాయి, ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయా, కాలిపోయాయా, లైన్లు ఎక్కడ దెబ్బతిన్నాయి. విద్యుత్‌కు అంతరాయం కలుగుతుంది, స్థంబాలు విరిగితే వాటిని మళ్ళీ పునరుద్దరించారా లేదా అని విద్యుత్ శాఖ అధికారులను వివరాలు అడిగారు. చెరువులు, కుంటలు తెగిపోయాయా, తెగిపోతే వాటి పరిస్థితి ఏమిటీ, వాటిని బాగు చేశారా లేదా అని ఆరా తీసారు. ఇక జిల్లాలో పత్తిపంట పరిస్థితిపై కూలంకుశంగా చర్చించారు. జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌లు మాట్లాడుతూ రైతులుకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్నారు. పంటలు నష్టపోతే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతులకు భరోసా కల్పించాలని అన్నారు.
Also Read: Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి..
రాబోవు రోజుల్లో..
పంటలు ఏమేరకు దెబ్బతిన్నాయో నివేదికలు రూపొంంచాలని సూచించారు. మొంథా తుఫాన్ ప్రభావం రైతులపై పడకుండా వారికి మనోధైర్యం కల్పించాలని, ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందనే భరోసా ఇస్తే రైతులు ధీమాగా ఉంటారని అన్నారు. కార్యాలయాల్లో ఉండి నివేధికలు తయారు చేస్తే రైతులు ఇబ్బందులు పడుతారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కుంటలు తెగితే వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాబోవు రోజుల్లో మరిన్ని తుఫానులు వస్తాయని, ఆకాల వర్షాలకు ఎలాంటి నష్టాలు జరుగకుండా, రైతులకు కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తడిసిన వరి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈనెలలో మరింత ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రైతులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కళ్ళాల వద్ద రైతులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్షాలోమ్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓలు గో
మున్సిపల్ పనులను వెంటనే చేయాలి
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50కోట్ల నిధులతో వెంటనే పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు సూచించారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటి నిధుల వినియోగం, అభివృద్ధిపై కలెక్టరెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ టోపోగ్రఫీ ఆధారంగా డ్రైనేజీలను, సీసీ రోడ్లను సిద్దం చేయాలని, పట్టణంలో ఎక్కడ మురుగు, వర్షం నీరు ఆగకుండా సైడ్ కాల్వల నిర్మాణంకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా 18డివిజన్లలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రెండో ప్రాధాన్యతగా వరద కాల్వలు, రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, మూడో ప్రాధాన్యతగా భవనాలు, పార్కులు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ లు నిర్మాణం చేయాలన్నారు. 30రోజుల్లో రూ.50కోట్ల నిధులతో పనులు ప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: AV Ranganath: పూడికతీత పనులు ఆపొద్దు.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విద్యార్థినులు!
