Gadwal Atrocity: దారుణం.. ఆస్తి కాజేసి తల్లికి రోగముందని ప్రచారం!
Gadwal Atrocity (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal Atrocity: గద్వాల జిల్లాలో దారుణం.. ఆస్తి కాజేసి తల్లికి రోగముందని ప్రచారం!

Gadwal Atrocity: ఆస్తులు లాగేశారు! అవసరం తీరాక కొడుకూ కోడలే కాలయములయ్యారు. కంటికి పాపల కాపాడుకుంటారని ఆస్తినంతా కొడుకూ కోడలు రాసిందా వృద్ధురాలు. అయితే ఆస్తి దక్కినంక ఆమెతో ఆ కొడుకూ కోడలుకు ఆమెతో అవసరం తీరిపోయింది. దీంతో ఆమెను వీధిలోకి గెంటేశారు. అంతేకాక ఎయిడ్స్‌(Aids) ఉందని ప్రచారం చేశారు. తనకు ఏ జబ్బూ లేదని ఆ వృద్ధురాలు ఎంతో వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఎవరూ తనను చేరదీయకుండా చేశారని ప్రజావాణిలో తనను కాపాడాలంటూ దీనంగా వేడుకుంది. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది.

మానసికంగా కృంగదీశార

జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హుస్సేన్‌బీ(Husseinby)(80) సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షులు కె.మోహన్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌(BM Santhosh)కు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన రెండో కుమారుడు, కోడలు చిన్న ఇస్మాయిల్‌, సాభేరాభాను తనను బాగా చూసుకుంటానని నమ్మబలికి ఇంటికి తీసుకెళ్లాడని, రామాపురం శివారులోని కోడలు సాబేరా భాను పేరున 4`26 ఎకరాలను, జూలకల్‌ శివారులో కొడుకు చిన్న ఇస్మాయిల్‌ పేరున 2`03 ఎకరాలను, కోడలు సాబేరా భాను పేరున 2`03 ఎకరాలను శాంతినగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో గిఫ్ట్‌ డీడ్‌ చేయించుకున్నారని, ఆస్తి రిజిస్ట్రేషన్‌ అనంతరం తన బాగోగులు చూడటం లేదని, మానసికంగా కృంగదీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read; Medak ST Hostel: ఎస్టీ హాస్టల్‌లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

అంటరాని రోగం ఉందని ప్రచారం

తనకు అంటరాని రోగం ఉందని, కనీసం తనకు ఎవరూ మంచినీరు కూడా ఇవ్వకుండా చేశారని పేర్కొన్నారు. ఆధార్‌ కార్(Aadhar Card)డు లాక్కున్నారని, ఎవరినీ సంప్రదించకుండా తన ఫోన్‌ లాక్‌ చేసి పెట్టారని తెలిపారు. తనకు తెలియకుండా తులంన్నర బంగారాన్(Gold)ని తీసుకున్నారని, సేవింగ్‌ అకౌంట్‌లోని డబ్బులను తనను వెంటతీసుకెళ్లి డ్రా చేసుకున్నారని, తనకు డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. కావున తన ఫిర్యాదును విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు. తన పేరున రిజిస్ట్రేషన్‌ అయిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి మళ్లీ తన పేరున భూమి నమోదు చేయాలని, తన ఇంటిలో వారు ఉండకుండా తన శేష జీవితం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ సదరు కోడలు, కుమారునిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?