Mahabubabad District: హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో మాల మహానాడు అధ్యక్షుడు నాగేల్లి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కరపత్రం ఆవిష్కరించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
ఈ సందర్భంగా ఆశోద భాస్కర్ మాట్లాడుతూ… రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మతోన్మాద సంస్థల మనువాద,ఎజెండాకు పాలకులు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాలని లక్ష్యంతో భారత రాజ్యాంగం పై వివిధ రూపాల్లో షదాడులు చేస్తున్నారు రాజ్యాంగాన్ని సనాతనం పేరుతో మార్చాలని కుట్రలకు పాల్పడుతున్నారని, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సనాతనం పేరుతో షూ విసిరేయాలని ప్రయత్నించాడు, ఈ ఘటన మరువక ముందే హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పురన్ ను కులం పేరుతో వేధించి తన మరణానికి కారణమైనారు అలాంటి వారిని వెంటనే శిక్షించాలని అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ మాట్లాడుతూ… పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని జాతీయ స్థాయిలో మాల,మహార్, అనుబంధ కులాల సర్వోముఖాక అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?
ఎస్సీ వర్గీకరణ
శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ జీవో నెంబర్ 99, జీవో నెంబర్ 20 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పురస్ సమీక్షించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 20 శాతానికి పెంచాలి. దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు దార్ల రామ్మూర్తి, పప్పుల వెంకన్న (108), బేతమల్ల చంద్రయ్య, సీనియర్ నాయకులు నాగేల్లి బిక్షం, మోటమరి యాకసాయిలు, యనమల్ల దర్గయ్య, ఎలమద్రి ప్రభాకర్, పగిడిపల్లి ప్రభుదాస్, నాగెల్లి వెంకన్న , ఎర్రం విజయ్ కుమార్, పప్పుల కుమారస్వామి, యనమల్ల యాకయ్య, పప్పుల అంజి, చిదురు రాము, చీదురు హరీష్, నాగెల్లి వెంకన్న,ఎర్రం ఉప్పలయ్య,అనిల్ ,మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ginning Mills Strike: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో అన్నదాతలు

