SS Rajamouli (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?

Varanasi: స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. టైటిల్ రివీల్ చేసేందుకు ప్రత్యేక ఈవెంట్‌ను గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) పేరుతో తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో గ్రాండ్‌గా జరిపారు. ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ అనుకున్నంత గొప్పగా జరగకపోవడం ఒకటి, అలాగే ఈ వేడుకలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఆయన దేవుడిపై నమ్మకం లేదని, రాముడు అంటే ఇష్టం లేదని, కృష్ణుడు అంటే ఇష్టమని గతంలో చేసిన కొన్ని ట్వీట్స్ బయటకు తీసి మరీ జక్కన్నను ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read- VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

వివాదంగా మారిన రాజమౌళి వ్యాఖ్యలు

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడిన తీరు, ఆయన వ్యక్తిగత విశ్వాసాలపై గందరగోళాన్ని సృష్టించింది. ఒకవైపు, తాను ‘దేవుడిని నమ్మను’ అని బహిరంగంగా చెప్పిన రాజమౌళి, అంతా హనుమంతులవారే చూసుకుంటారని.. వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. వెంటనే తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ, ‘కానీ, ఈరోజు ఏం చూసుకున్నారు? ఈ ఈవెంట్ అంత గొప్పగా ఏం జరగలేదు’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. దేవుడిని నమ్మనని చెప్పిన వ్యక్తి, ఈవెంట్ సరిగ్గా జరగకపోవడానికి పరోక్షంగా దైవ శక్తిని నిందించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, వ్యక్తిగతంగా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read- NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?

మానవ తప్పిదమా? దైవ నిందనా?

ఈవెంట్ విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం వేదిక వద్ద తలెత్తిన సాంకేతిక సమస్యలు లేదా ఈవెంట్ నిర్వహణలో జరిగిన లోపాలేనని (అంటే మానవ తప్పిదమే) నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంతర్జాతీయ ఈవెంట్‌ను ప్లాన్ చేసేటప్పుడు, సాంకేతిక ఏర్పాట్లను, లైవ్ సెటప్‌లను ఒకటికి పదిసార్లు సరిచూసుకోవాల్సిన బాధ్యత టీమ్‌పై ఉంటుంది. అలా చేయకుండా, ఈవెంట్ ముగిసిన తర్వాత ‘మైక్ పని చేయలేదు, స్క్రీన్ ఆగిపోయింది’ అని దేవుడిని నిందించడం ఏమిటని చాలామంది రాజమౌళిపై ఫైర్ అవుతున్నారు. ‘ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి, దేవుడిపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడటం సరికాదు’ అని కొంతమంది నెటిజన్లు హితవు పలుకుతున్నారు. రాజమౌళి వంటి ‘ఆస్కార్’ రుచి చూసిన దర్శకుడు.. తన ప్రతిభ, అదృష్టం, దైవానుగ్రహం లేకుండానే ఈ స్థాయికి చేరుకున్నారా? అని నెటిజన్లు కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా, ఈ ఈవెంట్ ‘వారణాసి’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంచనాలు పెంచడం కంటే.. రాజమౌళి వ్యాఖ్యలు, ఈవెంట్ నిర్వహణ లోపాలపై తీవ్ర చర్చకు, ట్రోలింగ్‌కు దారి తీసిందనే చెప్పుకోవాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AB4: జయ కృష్ణ ఘట్టమనేని సరసన ఆ భామే.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?

NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!