Warangal District (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Warangal District: వరంగల్​‌లో ఏసీబీ అధికారి వసూళ్ల దందా.. లక్షల్లో డబ్బు వసూళ్లు

Warangal District: కంచే చేను మేస్తే.. అన్న నానుడిని నిజం చేస్తున్నాడు వరంగల్(Warangal) రేంజ్ ఏసీబీ(ACB) అధికారి ఒకరు. అవినీతికి చెక్​ పెట్టాల్సింది పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నాడు. దీని కోసం సరికొత్త దారిని కనుక్కున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అరెస్టయిన నిందితుల బంధుమిత్రులను మీరంతా పట్టుబడ్డ అధికారికి బినామీలే.. మీపై కూడా కేసులు నమోదు చేస్తామని బెదరగొడుతూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ బాగోతంలో హైదరాబాద్(Hyderabad) లోని వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న ఆయన బ్యాచ్ మేట్లు సహకరిస్తుండటం గమనార్హం. డబ్బు కోసం సదరు అధికారి పెడుతున్న వేధింపులతో విసిగిపోయిన ఓ బాధితుడు ఏసీబీ(ACB) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఆమ్యామ్యాల అధికారి అతన్ని పిలిపించుకుని కంప్లయింట్ చేయటం వల్ల నన్నేమీ చేయలేవు.. నేను తలుచుకుంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్టు సమాచారం. అయితే, మరో ఇద్దరు బాధితులు వాట్సాప్ ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సమాధానంగా ఏసీబీ వర్గాలు త్వరలోనే కంప్లయింట్ పై స్పందిస్తామంటూ మెసెజ్ చేశాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

తనదైన స్టల్‌‌లో భయపెడుతూ..

వరంగల్ జిల్లాలో ఎమ్మార్వోగా పని చేస్తున్న ఓ అధికారిపై ఏసీబీ అధికారులు ఆగస్టు 29న ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా కేసులు నమోదు చేశారు. ఎమ్మార్వోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ కూడా చేశారు. ఆ తరువాత తనిఖీల్లో కీలక పాత్ర వహించిన ఓ డీఎస్పీ(DSP) స్థాయి అధికారి వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా అరెస్టయిన ఎమ్మార్వోకు దగ్గరి బంధువు అయిన ఓ వ్యక్తిని పిలిపించుకున్నాడు. అరెస్ట్​ అయిన అధికారి కూడబెట్టుకున్న ఆస్తులకు నువ్వు బినామీగా ఉన్నట్టు మా విచారణలో నిర్ధారణ అయ్యిందని తనదైన స్టయిల్​ లో భయపెట్టాడు. బినామీగా ఉన్నావు కాబట్టి నీపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్​ చేయాల్సి ఉంటుందని బెదిరించాడు. అలా జరగకుండా ఉంటాలంటే తాను చెప్పినంత మొత్తాన్ని చెల్లించుకోవాల్సిందే అని చెప్పాడు. ఇక, అరెస్టయిన ఎమ్మార్వో(MRO)తో పరిచయం ఉన్న మరో వ్యక్తిని కూడా ఇలాగే భయపెట్టాడు.

Also Read: OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?

స్నేహం ఉన్న పాపానికి..

అరెస్టయిన ఎమ్మార్వోకు హైదరాబాద్ లో సాఫ్ట్​ వేర్​ ఇంజనీర్​ గా పని చేస్తున్న వ్యక్తితో పరిచయం ఉంది. ఘట్​ కేసర్​ ప్రాంతంలోని ఓ గురువు వద్దకు వెళుతున్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఎమ్మార్వో తనను తాను పరిచయం చేసుకోగా సదరు సాఫ్ట్​ వేర్ ఉద్యోగి మీకు తెలిసి ఎక్కడైనా స్థలాలు చవకగా అమ్ముడు పోతుంటే సమాచారం ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఎమ్మార్వోకు ఫోన్లు చేశాడు. అయితే, అరెస్ట్ చేసిన తరువాత ఎమ్మార్వో ఫోన్ ను సీజ్​ చేసిన సదరు ఏసీబీ అధికారి కాల్​ లిస్టును బయటకు తీశాడు. దాని ఆధారంగా సాఫ్ట్ వేర్​ ఇంజనీర్​ తో కూడా మాట్లాడి డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే ఎమ్మార్వో ఆస్తులకు బినామీగా ఉన్నావని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు.

20లక్షలు ఇచ్చినా..

వరుసగా బెదిరింపులు వస్తుండటంతో బాధితుల్లో ఒకరు 20లక్షల రూపాయలను తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి గత నెల 11న వరంగల్ లోని పిస్తా హౌస్ హోటల్ వద్ద సదరు ఏసీబీ అధికారి తరపున వచ్చిన వారికి ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే డబ్బు తీసుకున్న ఇద్దరిలో ఒకరు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ విభాగంలో డీఎస్పీగా పని చేస్తుండటం. 20లక్షలు ఇచ్చినా ఒప్పుకొన్న ప్రకారం మిగితా డబ్బు ఇవ్వాలని బెదిరింపులను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు బాధితులు ఏసీబీ డీజీ చారూ సిన్హాకు ఫిర్యాదు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం తెలిసి సదరు ఏసీబీ డీఎస్పీ సాఫ్ట్​ వేర్ ఇంజనీర్​ గా పని చేస్తున్న వ్యక్తిని నాపై ఫిర్యాదు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టుగా తెలిసింది. దాంతో భయపడ్డ అతను కంప్లయింట్ ఇవ్వటానికి ముందుకు రాలేదు. కాగా, మరో ఇద్దరు బాధితులు మాత్రం వాట్సాప్ ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులకు శుక్రవారం వాట్సాప్​ ద్వారా తమకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. రహస్యంగా విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంప్లయింట్​ చేసినందుకు తమను మరిన్ని వేధింపులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలా జరగకుండా కాపాడాలని వేడుకున్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ వర్గాలు వాట్సాప్​ ద్వారానే ఫిర్యాదీలకు మీ కంప్లయింట్ మాకు అందింది అంటూ సమాధానం ఇచ్చాయి. త్వరలోనే దీనిపై స్పందిస్తామని తెలియచేశాయి.

Also Read: Cyber Crime: బీ కేర్ ఫుల్.. మీరు భయపడితే మొత్తం కొల్లగొడతారు: డీసీపీ దార కవిత

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్