AISF( IMAGE crediT: swetcha reporter)
నార్త్ తెలంగాణ

AISF: స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవాగ్నిని రగిలించిన నిప్పుకణం

AISF: స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ వాగ్ని రగిలించిన నిప్పుకణం, ప్రత్యేక తెలంగాణ సాధనకు తొలి, మలి దశ ఉద్యమంలో వీరోచిత పోరాటం, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో మహోద్యమం, దేశ చరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని జిల్లా అద్యక్షుడు మాగం లోకేష్, జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ పేర్కొన్నారు.  స్థానిక మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 90 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలుపెరగని సమరశీల ఉద్యమాల వేదిక, దేశానికి ఎందరో త్యాగదనులను అందించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ వారసత్వంతో నిత్యా రంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరిగని పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

ఉద్యమ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం

స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ స్వాతంత్రం కోసం జరిగిన సంగ్రామంలో ఉద్యమించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో ఏర్పాటు కాబడి నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతాలు అదిగుపెట్టి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మెకాలే విద్యా విధానం మాకొద్దంటూ విద్యారంగంలో సంస్కరణల కోసం పోరాడి, కొఠారి కమిషన్ సిఫారసుల అమలు చేయాలని పోరాటం చేసిన ఘనమైన చరిత్ర ఏఐఎస్ఎఫ్ దేనన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు కార్పొరేటర్ బిజీ క్లైమేట్ మాట్లాడుతూ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అన్న నినాదంతోని విద్య రంగ పరిరక్షణ కోసం బహుముఖ పోరాటాన్ని నిర్వహించింది. ముఖ్యంగా యూనివర్సిటీలు భావ్య సమాజంలో మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సొంతమన్నారు.

విద్యా విధానాన్ని ధ్వంసం

పెరుగుతున్న ధరల అనుగుణంగా మెస్ చార్జీలు, స్కాలర్షిప్స్ పెంపు కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, మహిళలపై జరుగుతున్న దాడులకు, అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిందన్నారు.
స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తూ జాతీయ నూతన విద్యా విధానం పేరుతో విద్యా విధానాన్ని ధ్వంసం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

విద్య వ్యవస్థను విచ్చిన్నం

ప్రవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్య వ్యవస్థను విచ్చిన్నం చేయాలని చూస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమించి, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీజిన్నా లాంటి మహా మహా మేధావులను దేశానికి అందించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ కి ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, పట్టణ కార్యదర్శి చెలువురి వికాస్, ప్రకాష్, వంశి, ప్రతాప్, వీరు పాల్గొన్నారు.

 Also Read: Chandhanagar robbery: కాల్పులు జరిపిన దుండగులు.. బైక్​ లపై సంగారెడ్డి వైపు పరార్

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు