Bhadradri Kothagudem (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: ఈ బాలుడు బుడ్డోడు కాదు.. చెట్లను నాటే కృషీవలుడు.. ఎన్ని మొక్కలు నాటాడో తెలుసా..?

Bhadradri Kothagudem: తెలంగాణ రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అయితే హరితహారం(Greenery) లో మొక్కలు నాటే టార్గెట్ మాత్రం అధికారులు తమ శాఖల ద్వారా, స్వచ్ఛంద సేవా సంస్థలు ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా కొనసాగుతోంది. కానీ, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కేంద్రానికి చెందిన నాలుగు(4) ఏళ్ల వయసులోనే మొక్కలు నాటాలని లక్ష్యాన్ని మదిలో పెట్టుకుని మొదలుపెట్టాడు. జూన్ 2, 2022 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana State Formation Day) సందర్భంగా మొదటి మొక్కను నాటిన బాలుడు నేటికీ 1184 మొక్కలను స్వయంగా గుంతలను తీసి మొక్కలను నాటిన ఘనత దక్కించుకున్నాడు. వనజీవి విశ్వామిత్ర మొక్కలు నాటే నాటి నుంచి నేటి వరకు 1184 డేస్ 1184 ట్రీస్ నాటి తన ఘనతను చాటుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం(Kothagudem) జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న మూడ్ జయరాం(Mood jayaram) స్వయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేటికీ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొంది ఉన్నాడు. మూడ్ జయరాం..అనూష దంపతుల పెద్ద కుమారుడు మూడ్ విశ్వామిత్ర చౌహన్ ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ నవభారత్ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నాడు. తెలిసి తెలియని వయసులోనే మొక్కలు నాటాలని బీజం ఆ బాలుడు మనసులో పడడంతో నిత్యం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గుణపం తీసి గుంత తవ్వి మొక్క నాటడమే ఆ బాలుడు పనిగా పెట్టుకున్నాడు.

ఈ బాలుడు.. నిత్య కృషీవలుడు

నాలుగేళ్ల వయసులోనే తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2, 2022న చెట్లను నాటే ప్రక్రియను ప్రారంభించాడు. 10 లక్షల సీడ్ బాల్స్(Seed Balls) ను తయారుచేసి ఫారెస్ట్, వివిధ శాఖల అధికారులకు అందించిన ఘనత ఈ బుల్లి బాలుడిది. తెలంగాణ గవర్నమెంట్ లో కేటీఆర్(KCR), కవిత(Kavitha), సంతోష్ రావు(Santhosh Rao) లతో కలిసి మొక్కలు నాటాడు. ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క మల్లు(Mini Bhatti Vikramarka), పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy), తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao), కలెక్టర్లు జితేష్ బి పాటిల్(Collectors Jitesh B Patil) లతోపాటు మరికొంతమంది, ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohith Raj), అటవీ శాఖ అధికారి కిష్ట గౌడ్ లతో కలిసి ఎన్నో మొక్కలు నాటాడు.

వనజీవి రామయ్య వారసుడు

నాలుగేళ్ల వయసులోనే మొక్కలు నాటాలని ఆలోచనతో ఎన్నో వందల మొక్కలను నాటిన మూడ్ విశ్వామిత్ర చౌహన్ చౌహన్ గురించి తెలుసుకున్న వనజీవి రామయ్య స్వయంగా విశ్వామిత్రకు ఫోన్ చేసి తన వద్దకు రప్పించుకున్నాడు. తన తర్వాత తన వారసుడిగా వనజీవి విశ్వామిత్ర చౌహన్ నిలుస్తాడని స్వయంగా ప్రకటించాడు.

Also Read: Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..

ఫారెస్ట్, కార్యాలయాలు, రహదారులపై విలువైన మొక్కల నాటిన వైనం

బుల్లోడు చిన్నోడే కానీ అనుకున్న లక్ష్యం మాత్రం చాలా పెద్దది. ఒక్క రోజుతో ఒక్క మొక్కతో ఆగే లక్ష్యం కాదది. నిత్యం మొక్కలు నాటాలని బీజం పడింది. ఆ చిన్నారి బాలుడు మూడ్ విశ్వామిత్ర చౌహన్ లో. ఫారెస్ట్, కార్యాలయాల్లో, రహదారులపై విలువైన మొక్కలు నాటిన ప్రేమికుడు. ఓవైపు మొక్కలు నాటే నిత్య ప్రక్రియను మొదలుపెట్టిన విశ్వామిత్ర చౌహన్(Vishwamitra Chauhan). మరోవైపు మొక్కలను పెంచేందుకు వేసవి సమయంలో అటవీ ప్రాంతానికి వెళ్లి వివిధ రకాల సీడ్ లను సేకరించి దాదాపు పది లక్షల పైగా విత్తనాలను వివిధ కార్యాలయాల నిర్వాహకులకు అందజేశాడు. ఫారెస్ట్ రిస్ట్రిక్షన్స్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, రహదారులపై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై తనకున్న బాధ్యతలను చాటుకున్నాడు. నేటి వరకు విశ్వామిత్ర చౌహన్ 1184 మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణ కోసం తనవంతుగా కృషిని చేస్తున్నాడు.

బుక్ ఆఫ్ రికార్డుల్లో విశ్వామిత్ర

దేశంలో ఎన్నో రకాల బుక్ ఆఫ్ రికార్డు(book Of Records)ల్లో రికార్డుగా విశ్వామిత్ర అవార్డులను అందుకున్నాడు. అవార్డులే రికార్డులుగా వనజీవి విశ్వామిత్ర చౌహన్ గా నిలిచిన చిన్నారి బాలుడి రికార్డుల వివరాలు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వనజీవి రామయ్య చేతుల మీదుగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ (ఈ అవార్డు ఏఆర్ రెహమాన్(AR Rahman), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) లతోపాటు మరికొంతమంది ప్రముఖులు మాత్రమే పొందారు) ఈ అవార్డును సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా, జిల్లా కలెక్టర్ మూడుసార్లు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. జిల్లా అటవీశాఖ అధికారి క్రిష్టా గౌడ్ రెండుసార్లు ప్రశంసా పత్రాలను అందించారు. షిఫ్ట్ అండ్ లిఫ్ట్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా బిజినెస్ దిగజాలకు అందించే ప్రతిష్టాత్మక అవార్డు పర్యావరణానికి విశేషంగా కృషి చేస్తున్న విశ్వామిత్ర కు ప్రత్యేకంగా ప్రముఖ సినీనటి ప్రణీత అందజేసి అభినందించారు. మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండలో నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) చేతులమీదుగా కాకతీయ పురస్కారాన్ని విశ్వామిత్ర అందుకున్నారు.

Also Read: Nano Urea: రైతన్నలకు గుడ్ న్యూస్…ఈ యూరియాతో పంట దిగుబడులు పెరగడం ఖాయం

అత్యంత పురస్కార అవార్డు

కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి విశ్వామిత్రను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్(Telugu Book Og Records) వారు అందించే నంది అవార్డు(Nanadhi Awards) సైతం విశ్వామిత్రను వరించింది. తెలంగాణ సాంస్కృతిక సంస్థ వారిచే అత్యంత పురస్కార అవార్డును ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodhnada Ram) చేతుల మీదుగా అందుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు వరల్డ్ వెల్ బీయింగ్ వారి పురస్కారాన్ని ముఖ్య అతిథిగా పింగళి వెంకయ్య మనవడు నరసింహన్ తో వేదిక పంచుకొని వారిచ్చే జాతీయ పతాకాన్ని అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో 8సార్లు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. మూడు సంవత్సరాల వయసులోనే చెట్లను నాటే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న విశ్వామిత్రకు వనజీవి రామయ్య మరణానంతరం ఆయన జ్ఞాపకార్థకంగా అందించే ప్రతిష్టాత్మక వనజీవి రామయ్య అవార్డును తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వామిత్ర అందుకున్నారు.

కేసీఆర్, చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(ఱఢఇ), ఆధ్యాత్మిక గురు చిన్న జీయర్ స్వామి(chinna jeeyar swamy) చేతుల మీదుగా కూడా “వనజీవి విశ్వామిత్ర చౌహన్”ప్రశంసా పత్రాలను అందుకోవడం గమనార్హం.

విశ్వామిత్ర చౌహన్ నాటిన మొక్కల వివరాలు

మూడేళ్ల ప్రాయంలోనే పర్యావరణ పరిరక్షణకు భవిష్యత్తు తరాల బాగుకోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విశ్వామిత్ర చౌహన్(Vishwamitra Chauhan) నాటిన మొక్కల వివరాలు. ఎర్రచందనం ప్యూర్ ఆక్సిజన్, ప్రభుత్వానికి ఆదాయం వనకూర్చే 400 మొక్కలను ఒక్కో మొక్కను రూ.210 లతో కొనుగోలు చేసి నాటాడు. అదేవిధంగా తైవాన్ మామిడి ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చే, అదేవిధంగా అటవీ ప్రాంతంలో కోతులు ఇతర వన్యప్రాణులకు ఆహారంగా లభించేందుకు తైవాన్ మామిడి రకం 150 మొక్కలను రూ. 300 నుండి రూ. 350 వరకు వెచ్చించి కొనుగోలు చేసి చిన్నారి విశ్వామిత్ర నాటాడు. ఇంకా ఫలాలు ప్రాణవాయువు ఇచ్చే కబంధ, మారేడు, నేరేడు, వాటర్ ఆపిల్, ఆపిల్, నేరేడు లో మరో రెండు రకాలు, వేప, పొగడ, నాగవల్లి (మహావృక్ష జాతి), పున్నస మామిడి, ఆరెంజ్, బాదం, జీడి మామిడి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు ఈ బుల్లోడు. శుక్రవారం నాటిన మొక్కతో నేటికీ 1184 మొక్కలను నాటాడు.

సెంట్రల్ మినిస్టర్ టు సెంట్రింగ్ వరకు వనజీవి విశ్వామిత్ర చౌహన్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి నుంచి సెంట్రింగ్ మేస్త్రి వరకు అందరితో ప్రశంసించబడ్డాడు. వనజీవి విశ్వామిత్ర చేస్తున్న కృషిని రాష్ట్ర మాజీ సీఎం, రాష్ట్ర మాజీ మంత్రులు, ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, ఎస్పీలు, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, సామాజిక బాధ్యులు విశ్వామిత్రను ప్రశంసించి అభినందించిన వారే.

Also Read; Fraud in Sports Board: బోర్డులకే పరిమితమైన ప్రాంగణాలు.. కనిపించని క్రీడా పరికరాలు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్