Maoists surrender: 17 మంది మావోయిస్టులు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆపరేషన్ చేతులు భాగంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ రకాల క్యాడర్లకు చెందిన మావోయిస్టుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల పునరావాస సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన అజ్ఞాత సహిత దళాల మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ వెంటనే తగిన రివార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు.
అజ్ఞాత సాహిద దళాలు
చత్తీస్గడ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారంతో అవసరమైన దీర్ఘకాలికత పునరావాస చర్యలు కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు. మావోయిస్టు అజ్ఞాత సాహిద దళాలు తెలంగాణ ప్రాంతంలో సంచరించినట్లయితే ఏ ఒక్క ధన సభ్యుడు కూడా పోలీస్ శాఖ తీసుకునే చట్టపరమైన చర్యల బాధ్యులవుతారని హెచ్చరించారు. జరిగిన కర్రెగుట్టలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మొత్తం 31 మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు కాలం చెల్లిన ఆచరణాత్మకం కానీ సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకునే కాలం ఎప్పుడూ చెల్లిపోయింది అన్నారు. మావోయిస్టులకు ప్రస్తుత తరుణంలో చావో రేవు కంటే నివారణ మేలని గ్రహించుకోవాలని సూచించారు. మావోయిస్టు పార్టీలు పనిచేస్తున్న మిలీషియా, ఆర్ పి సి సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు.
Also Read: GHMC: అబ్బా.. ఏం వాడకం.. జీహెచ్ఎంసీలో ఆధునిక టెక్నాలజ:
లొంగిపోయిన వారి వివరాలు
మాధవి హుంగ, సున్నం లచ్చు, సావలం లలిత, మడవి శుల, మడివి బండి, నుప్పా లక్ష్మీ, కోవసి అడుమా, మడకం సోమూడు, నుపో ఉంగీ, వంజం ఉంగ, కాల్ ముడువా, మడవి లక్మ, మడకం సహదేవ్, ముచ్చకి దడే, కొవ్వాసి నాందే, మడకం హడుమ, నుపో ముయా లు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు.
Also Read: Anganwadi teachers: రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!