Anganwadi teachers: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ (రిటైర్మెంట్) ప్రయోజనాల పెంపు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ పంపిన ఫైల్‌కు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఫైల్‌ను ఫైనాన్స్ శాఖ క్లియర్ చేయడంతో జీవో జారీకి మార్గం సుగమమైంది. ఇకపై పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,580 పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
Also Read: Jaleel Khan Health Issue: మహానాడులో షాకింగ్ ఘటన.. వేదికపై కుప్పకూలిన టీడీపీ నేత
70 వేల మంది సిబ్బంది
ప్రతి సెంటర్‌కు ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండటంతో, సుమారు 70 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతీ ఏడాది సగటున 7000 మంది పదవీ విరమణ పొందుతుండగా.. రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు గా ఉంది. ప్రస్తుతం టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు మాత్రమే అందజేస్తున్నారు. కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రజా ప్రభుత్వం రెట్టింపు చేసింది. సాంకేతిక కారణాలతో ఫైల్ కొంతకాలంగా పెండింగ్‌లో ఉండగా, ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించి, అనుమతులు జారీ చేశారు. దీంతో సంబంధిత ఫైల్ కి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే సంబంధిత జీవో జారీ కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది.
Also Read: Gang Arrested: అంతర్ రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్.. 5 తపంచాలు…18 బుల్లెట్లు స్వాధీనం!