Nara Lokesh: అవును.. టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంత్రి నారా లోకేష్ నోట.. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగ్ వచ్చింది. అది కూడా పాపులర్ డైలాగ్ కావడంతో.. వారెవ్వా అంటూ టీడీపీ (TDP) శ్రేణులు, లోకేష్ వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇది సినిమా డైలాగే అయినప్పటికీ పాలిటిక్స్‌లో మాత్రం తెగ వాడేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట కూడా చాలాసార్లు ఈ డైలాగ్ వచ్చింది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి? ఏ సినిమాలోనిది? అనే కదా మీ డౌట్.. ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలన్నీ ‘స్వేచ్ఛ’ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి మరి..
Read Also- Mahanadu 2025: టీడీపీలో కోవర్టులు.. స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఫస్ట్ టైం పేలిపోయిందిగా..
బహిరంగ సభలు, సమావేశాలు, మీడియా సమావేశాల్లో యువనేత లోకేష్ చాలా అరుదుగా ప్రసంగిస్తుంటారు. అందులోనూ డైలాగ్స్ అంటారా చాలా తక్కువే. అలాంటిది మహానాడు-2025లో తొలిసారి డైలాగ్ పేల్చారు. ‘పుష్ప-1’ సినిమా ఏ రేంజిలో బ్లాక్ బ్లస్టర్ అయ్యిందో.. ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా అంతకుమించి సూపర్ డూపర్‌గా పేలిపోయాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అనుకోకుండానే ఈ సినిమా డైలాగ్ వచ్చేస్తుంటుంది. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దోళ్ల వరకూ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంటుంది. గురువారం నాడు మహానాడు చివరి రోజున బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. ‘తగ్గేదేలే’ (Thaggedele) అంటూ డైలాగ్ అదరగొట్టారు. అంతేకాదు.. గడ్డం కింద చెయ్యి పెట్టి మరీ యాక్షన్ చేస్తూ మరీ చెప్పారు. దీంతో లోకేష్ డైలాగ్, యాక్షన్ ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే అబ్బో.. ఓ రేంజిలో వైరల్ అవుతోంది. దీనికి చిత్ర విచిత్రాలుగానూ కామెంట్స్ వస్తున్నాయి. వావ్.. లోకేష్ ఫస్ట్ టైమ్ డైలాగ్ పేల్చారని కొందరు.. ఇరగదీశారని ఇంకొందరు అభిమానులు చెప్పుకుంటున్నారు.
చెర్రీని మరిచారేం బాస్..?
ఇక ఏ హీరో అభిమానులు.. ఆ హీరోకు డైలాగ్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) డైలాగ్ కూడా పేల్చొచ్చు కదా. మరిచిపోయారేం బాస్.. అని మెగాభిమానులు కాసింత అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉంది.. ప్రభుత్వంలో కీలకంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉన్నారుగా ‘గబ్బర్ సింగ్’, ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలను లోకేష్‌కు గుర్తు చేస్తున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్‌ను అయితే జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు పదే పదే గుర్తు చేస్తున్నారు. కామెంట్స్‌లో చాలా వరకూ ఇవే వస్తున్నాయి. ఇక పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ సినిమాలను ప్రత్యేకించి మరీ చెబుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) డైలాగ్ కొట్టొచ్చుగా గురూ? అని కొందరు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.. అంతేకాదండోయ్ నెక్స్ట్ సభలో అయినా గట్టిగా ప్రాక్టీస్ చేసి మరీ కానివ్వండి అని కోరుతున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు అయితే ‘ తొలిసారి ఈ డైలాగ్ వచ్చిందే వైఎస్ జగన్ నోట’ అని చెప్పుకుంటున్నారు.
Read Also- YS Jagan: కడపలో మహానాడుపై వైఎస్ జగన్ ఫస్ట్ రియాక్షన్.. ఇంత మాట అన్నారేంటో?
అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన నారా లోకేష్ pic.twitter.com/UcDMR2RrB0
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2025