Jaleel Khan Health Issue: కడప జిల్లా జరుగుతున్న టీడీపీ మహానాడులో అపశ్రుతి చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (Jaleel Khan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్టేజీపైనే కుప్ప కూలిపోయారు. ఇది చూసి సభా ప్రాంగమంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు (TDP Cadre).. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కడపలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నుంచి టీడీపీలోకి..
జలీల్ ఖాన్ విషయానికి వస్తే ఆయన విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1999లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరపున పోటీ చేసి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వైసీపీ (YSRCP)లో చేరి 2014లో మరోమారు అదే స్థానం నుంచి గెలుపొంచారు. అయితే 2016లో జగన్ పార్టీని (YS Jagan) వీడి.. అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గానూ గతంలో పనిచేశారు.
Also Read: Mallareddy On Kavitha: కవిత పులి బిడ్డ.. కేసీఆర్‌ను ఎప్పటికీ వీడదు.. మల్లారెడ్డి
పొత్తులో భాగంగా సీటు త్యాగం
2019లో ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కూతురు టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ఆమెపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) గెలుపొందారు. 2024లో టీడీపీ తరపున విజయవాడ వెస్ట్ సీటు ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీ (AP BJP)కి వెళ్లిపోయింది. కమలం పార్టీ నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి (Sujana Chowdary) గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతూ ఆ పార్టీకి ముఖ్యమైన మైనారిటీ నాయకుడిగా జలీల్ ఖాన్ కొనసాగుతూ వస్తున్నారు.
