Malla Reddy (Image Source: Twitter)
తెలంగాణ

Mallareddy On Kavitha: కవిత పులి బిడ్డ.. కేసీఆర్‌ను ఎప్పటికీ వీడదు.. మల్లారెడ్డి

Mallareddy On Kavitha: బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత (Kalvakuntla Kavitha) అంశం.. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేసీఆర్ (KCR)కు లేఖ రాసి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆమె.. ఆ తర్వాత తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) ను బీజేపీ (BJP) లో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ తాజాగా ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ కూడా ఊపందుకుంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy) స్పందించారు. తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

‘టైగర్ బిడ్డ.. పులి’
బీఆర్ఎస్ – కవిత వివాదంపై కాంగ్రెస్ నేత మల్లారెడ్డి తాజాగా మాట్లాడారు. కవిత త్వరలోనే బీఆర్ఎస్ ను వీడుతుందన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. అందరూ కేసీఆర్ తోనే ఉంటారని మల్లారెడ్డి స్పష్టం చేశారు. కవిత పార్టీ మారదని తేల్చి చెప్పారు. చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయని అన్నారు. కవిత.. కేసీఆర్ బిడ్డన్న మల్లారెడ్డి ఆమె పులిబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. ‘టైగర్ బిడ్డ.. పులి’ అంటూ వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం నోటీసులపై
మరోవైపు కాళేశ్వరంపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) కేసీఆర్ తో పాటు హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైనా మల్లారెడ్డి తాజాగా మాట్లాడారు. కమిషన్ ఎన్ని నోటీసులు ఇచ్చినా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ కమిషన్ వద్దకు వెళ్తారని స్పష్టం చేశారు. కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని ఆకాంక్షించారు.

Also Read: BJP on Allu Arjun Award: గద్దర్ అవార్డులపై రాజకీయ రగడ.. కాంగ్రెస్‌ను ఏకిపారేస్తున్న బీజేపీ!

కేటీఆర్‌పై కవిత మళ్లీ ఫైర్
తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసలే మంచిదాన్ని కాదన్న కవిత.. నోరు తెరిస్తే బాగోదని వ్యాఖ్యానించారు. మా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి? అంటూ ప్రశ్నించారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపే సత్తా లేదని కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కవిత అన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే కుట్ర మెుదలైందని స్పష్టం చేశారు. తనకు, కేసీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోదని.. తనను దూరం చేస్తే ఎవరికీ లాభమో అందరికీ తెలుసని అన్నారు.

Also Read This: Kavitha on KTR: నీకెంటి నొప్పి.. కేసీఆరే నాకు బాస్.. కేటీఆర్‌పై కవిత ఫైర్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ