GHMC: స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విషయంలో జీహెచ్ఎంసీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. 2017 నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని 5.50 లక్షల స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అగ్రిమెంట్ (Agreement) గడువు ముగియటంతో కొత్తగా ఆధునిక టెక్నాలజీని వినియోగించి, మెయింటెనెన్స్ కు సంబంధించిన అన్ని రకాల పనులు ఒకే ఏజెన్సీ చేపట్టేలా జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. ఇప్పటి వరకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఈఈఎస్ఎల్ వరకు పోల్స్ వారీగా, మరమ్మతుల వారీగా ఈ నిర్వహణ బాధ్యతులుండేవి. కానీ, కొత్తగా ఎంపిక చేసుకోనున్న ఏజెన్సీ నిర్వహణకు సంబంధించి ఆల్ ఇన్ వన్ బాధ్యతలు నిర్వహించేలా ఉండాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఇందుకు గాను ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు నగరాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై నున్న స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అమలు చేస్తున్న ఇండివిజ్యూవల్ లుమినార్ కంట్రోల్ (ఐఎల్ సీ) విధానాన్నే అమలు చేయాలని జీహెచ్ఎంసీ అనుకుంటున్నది.
ఆ తర్వాతే అంతా..
ఐఎల్‌సీతో పాటు ఇంటిగ్రేటెడ్ లుమినార్ మానిటరింగ్ (ఐఎల్ఎం) విధానాలను అమలు చేస్తూ గ్రేటర్ లోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు కింద ఏజెన్సీలను ఆహ్వానించింది. వీటిలో పాల్గొన్న ఏజెన్సీలకు త్వరలో ప్రీ బిడ్, పోస్ట్ బిడ్ సమావేశాలను నిర్వహించిన అనంతరం ఏజెన్సీలు సమర్పించే నివేదికలు సంతృప్తి కరంగా ఉంటేనే జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది. ఇందుకు గత ఏడేళ్లలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఈఈఎస్ఎల్ తో జీహెచ్ఎంసీ నిర్వహణ పరంగా ఎదుర్కొన్న సమస్యలన్నింటిని నోటెడ్ చేసుకుని, వాటినే కొత్త ఏజెన్సీ ముందు కండీషన్లుగా పెట్టనుంది. ఇందుకు అంగీకరించే ఏజెన్సీకే లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. లైట్లపై చేపట్టిన సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 4.56 లక్షల స్ట్రీట్ లైట్లను గుర్తించినట్లు, సర్వే తది దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also- YSRCP: వంశీ విడుదల సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు?
కండిషన్లు ఇలా..
గ్రేటర్ పరిధిలో ఆరున్నరేళ్ల పాటు స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ బాధ్యతలు నిర్వర్తించిన ఈఈఎస్ఎల్ మరమ్మతులకు సంబంధించి కేవలం జోన్ల వారీగా, గ్రేటర్ పరిధిలో మొత్తం ఆరు గోదాములనే ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు తాజాగా నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న కొత్త ఏజెన్సీ 30 సర్కిళ్లలో సర్కిల్ వారీగా గోదాములను ఏర్పాటు చేసి, వాటిలో రౌండ్ ది క్లాక్ అయిదు శాతం లైట్లతో పాటు మరమ్మతులకు అవసరమైన సామాగ్రిని నిల్వ చేసుకోవాలన్న నిబంధన పెట్టారు. అయితే వీధి ధీపాలకు సంబంధించి ప్రస్తుతం మూడు వేల వరకు ప్రతి నెల వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ కార్పొరేటర్ కు వస్తున్నందున, గోదాములను సర్కిల్ లో గానీ, వార్డ్డులో గానీ ఏర్పాటు చేయాలన్నవిషయంపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. దీంతో పాటు ఎక్కడైనా లైటు పాడైపోయినా, కాలిపోయినా, 45 గంటల్లోపు దాన్ని మార్చాలన్న షరతులను కూడా విధించనున్నారు. అలాగే కేవలం పోల్స్, స్ట్రెచ్ ల వారీగా కాకుండా ప్రతి పోల్, పోల్ కు ఉన్న లైట్లవారీగా అన్ని రకాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నది తాజా నిబంధనగా పెట్టనున్నారు. ప్రతి స్ట్రెచ్ కు ఉన్న మానిటరింగ్ కంట్రోల్ బాక్స్ ను కూడా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. వెలిగిన లైట్లకు మాత్రమే కరెంటు వినియోగం కావాలని, ఆ వినియోగమైన కరెంటు మాత్రమే బిల్లులు వచ్చేలా ఆధునిక విధానాన్ని అనుసరించాలని జీహెచ్ఎంసీ ఏజెన్సీలకు సూచిస్తుంది. అలాంటి ఏర్పాట్లు, మిషనరీ, మ్యాన్ పవర్ ఉన్న ఏజెన్సీలే ఈఓఐ సమర్పించాలని కూడా ఈఓఐ నోటిఫికేషన్ లో జీహెచ్ఎంసీ స్పష్టంగా సూచించింది.
ఈఓఐకు నాలుగు సంస్థలు
స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ కు సంబంధించి కొత్త ఏజెన్సీని నియమించటంలో భాగంగా అధికారులు చేపట్టిన ఈఓఐ కు గురువారంతో గడువు ముగిసింది. ఇందుకు స్నెల్, ఛరీష్మా, పిలిప్స్, క్రాంప్టన్ సంస్థలు ముందుకొచ్చినట్లు వీటిలో ఇప్పటికే స్నెల్, ఛరీష్మా సంస్థలు ఇంట్రెన్స్ ను సమర్పించగా, గ్రేటర్ పరిధిలో చాలా పెద్దదని, ఇంట్రెన్స్ సమర్పించేందుకు ఇంకా కొంత సమయం ఇవ్వాలని పిలిప్స్, క్రాంప్టన్ సంస్థలు కోరినట్లు, అందుకు అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఇంట్రెస్ట్ సమర్పించిన ఏజెన్సీలకు త్వరలోనే అధికారులు ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, నియమ నిబంధనలను వివరించనున్నట్లు సమాచారం.
Read Also- Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?