Crime: ప్రేమ అనే ఈ రెండు అక్షరాల పదాలు. ఒక ప్రాణాన్ని బతికించగలవు. తలచుకుంటే చంపగలవు కూడా..! నేటి సమాజంలో ప్రేమించిన వాళ్ళు ప్రేమను గెలిపించుకోలేక విడిపోయే వాళ్ళు కొందరైతే, ప్రేమను ఎలా అయిన దక్కించుకోవాలని క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు మరి కొందరు. ఒక మనిషితో పదే పదే మాట్లాడితే వారి మీద ఇష్టం కలుగుతుంది. దీనికి చాలా మంది ప్రేమ పేరు పెట్టి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి, ఇక్కడ మనిషే తనకు తానుగా అన్ని ఊహించుకుని ఉన్న ఒక్క జీవితాన్ని ప్రేమ పేరుతో నాశనం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు.. సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో నిత్యం… అదేపని
రోజు రోజుకు మనుషులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఓ యువతీ, ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోలేదని ఏకంగా వాహనాలను దగ్ధం చేసింది. ఈ ఘటన టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోపంతో ఎలా ప్రవర్తించిందో ఆమెకే తెలియకుండా పోయింది. క్షణికావేశానికి ఒకటి కాదు .. రెండు కాదు.. ఏకంగా 14 వాహనాలకు నిప్పటించింది.
ప్రేమించిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో కోపంతో ఊగిపోయిన యువతి. అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలకు నిప్పు అంటించి పారిపోయింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తున్న యువతి. రెండేళ్ల క్రితం మరో మరొక ఆమెను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. అతని సంతోషాన్ని పాడు చేద్దాం అనుకున్నట్టు ఉంది.. రాగానే అతడి బైక్ కు నిప్పంటించిన యువతి, అదే బైకును ఆనుకొని ఉన్న మిగతా బైకులు కూడా పూర్తిగా దగ్ధ మయ్యాయి. ముందుగా అక్కడున్న అపార్ట్మెంట్ వాసులు ఆకతాయిల పనిగా భావించారు.
Also Read: Mega 157: ఉగాది రోజున మెగా ట్రీట్ .. ఒకే ఫ్రేమ్ లో చిరు, వెంకీ.. ఫ్యాన్స్ కు పండుగే..!
సీసీటీవీ మొత్తం చెక్ చేయగా యువతి చేసినట్టుగా గుర్తించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం మొత్తం చెప్పడంతో నిందితురాలని రిమాండ్ కు తరలించారు.