Vishaka Double Murder Case: విశాఖలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్న వృద్ధ దంపతులను ఇంట్లోనే గత వారం హతమార్చారు. తీవ్ర రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసి బంధువులతో పాటు స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడు ఇంటర్నేషన్ క్రిమినల్ అని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. మృతురాలితో నిందితుడికి అక్రమ సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఒడిశాకు చెందిన ప్రసన్న కుమార్ మిశ్రా.. డబ్బు కోసం వృద్ధ దంపతులను హత్య చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. మహిళ మృతదేహం నుండి 4.5 తులాల బంగారం, స్కూటీని కూడా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బంగారు ఆభరణాలు, బైక్ ను నిందితుడు పూరిలో అమ్మివేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి రూ.4,18,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రసన్న కుమార్ శర్మ ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్న విశాఖ సీపీ.. అతడు దుబాయిలో నేరం చేసినట్లు చెప్పారు. ఇందుకు గాను ఆ దేశంలో ఐదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్లు చెప్పారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకొని నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాను అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ స్పష్టం చేశారు. అయితే చనిపోయిన మహిళతో ప్రసన్న కుమార్ శర్మకు గత మూడేళ్లుగా అక్రమ సంబంధం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న రూ.5 లక్షల అప్పు తీర్చడానికి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సీపీ తెలిపారు. మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగలించే ప్లాన్ లో ఈ డబల్ మర్డర్స్ చోటుచేసుకున్నట్లు వివరించారు.
Also Read: Kishan Reddy: కాంగ్రెస్ చేసింది క్యాస్ట్ సర్వే.. అది కూడా తూతూ మంత్రమే..
విశాఖపట్నం పరిధిలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్ లో ఈ జంట హత్యలు కలకలం రేపాయి. నావల్ డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి నాగేంద్ర (Nagendra) ఆయన భార్య లక్ష్మీ (Lakshmi)లను దుండగుడు దారుణంగా హత్య చేశాడు. దీంతో ఇంటి లోపల రెండు వేర్వేరు గదుల్లో వారు విగత జీవులుగా మారారు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు చూసి బంధువులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.