Janasena Peethala Murthy (imagecredit;twitter)
విశాఖపట్నం

Janasena Peethala Murthy: సింహాచలం విషాదం..తప్పంతా వైసీపీదే!.. జనసేన నేత!

Janasena Peethala Murthy: సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాదంపై జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పర్యాటకం దేవాదాయ శాఖకు ప్రసాదం అనే ప్రాజెక్టు కింద 54 కోట్లు నిధులు ఇచ్చిందని, 2023 మే నెలలో అనంత రావు అనే కాంట్రాక్టర్ కు 12 నెలల్లో పనులు పూర్తి చేసేలా 26 కోట్ల 80 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు సింహాచలం దేవస్థానంలోని 26 కోట్ల 80 లక్షల పనులు పూర్తికాలేదని ఆయన అన్నారు.

ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టి, నిర్మాణాలను పరిశీలించాల్సిన టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ రావు వై సిపి ప్రభుత్వ హయాంలో పెద్ద అవినీతిపరుడని, రమణ రావు మీద కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టూరిజం మంత్రికి స్వయంగా నేనే ఫిర్యాదు చేశానని అన్నారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో గాని హరిత రిసార్ట్స్ ఫర్నీచర్ అమ్మకంలోగాని టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ అవినీతికి పాల్పడ్డాడని అన్నారు.

Also Read: Farmers: ఆర్గనైజర్ల బరితెగింపు.. రైతుల పరిహారం దోచుకునే యత్నం?

టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రమణ ఆధ్వర్యంలోనే సింహాచలం ఆలయంపై నిర్మాణ పనులు జరుగుతున్నాయని, టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ మాత్రమే కాదు సింహాచలం దేవస్థానంలో ఈగ ఉన్న శ్రీనివాసరాజు కూడా దశాబ్ద కాలంగా ఒకేచోట పనిచేస్తున్నాడని అన్నారు.

అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల వల్లే సింహాచలం ఆలయంలో ఏడుగురు చనిపోయారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసాదం స్కీము 54 కోట్ల నిధుల పనుల పైన విజిలెన్స్ తో ఎంక్వయిరీ చేయాలని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. త్రి సభ్య కమిటీ పూర్తిగా దర్యాప్తు చేసి ఈ ప్రమాదానికి కారణమైన అవినీతి కాంట్రాక్టర్లు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Also Read: CM Revanth Reddy: దేనికైనా రెడీ.. కేసీఆర్ కు సీఎం రేవంత్ మాస్ ఛాలెంజ్!  

సింహాచలం ప్రమాద స్థలంలో వివరాలను త్రిసభ్య కమిటి సేకరించింది. ప్రమాద స్థలంలో కాంట్రాక్టర్‌ను కమిటీ ప్రశ్నించింది. ఆరు రోజుల్లోనే గోడను కట్టలేమని అధికారులకు కాంట్రాక్టర్ చెప్పామన్నారు. ఇంకా ఆరు రోజులు టైం ఉంది పర్లేదు గోడ కట్టమని టూరిజం ఈఈ, దేవస్థానం ఈఈ అన్నారని కాంట్రాక్టర్ చెప్పారు. టెంపరరీ గోడ అని చెప్పడంతో పని మొదలు పెట్టానని కమిటీ సభ్యులకు కాంట్రాక్టర్ చెప్పాడు.

నిర్మాణ సమయం తక్కువగా ఉండడంతో టెస్టింగ్‌ కూడా చేయలేదని, పర్యవేక్షణను పట్టించుకోలేదని అధికారుల తెలిపారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులపై త్రిసభ్య కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాలపై త్రిసభ్య కమిటీ సభ్యులు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం