Mega 157: మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తన కొత్త సినిమాను ఎట్టకేలకు షురూ చేశాడు. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో పెద్ద విజయం సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో #మెగా 157 అనే కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశాడు. నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో గ్రాండుగా లాంచ్ చేశారు. ఇక, ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ కొట్టిన కొట్టారు.
ఈ పూజ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు. నిర్మాత దిల్ రాజు చిత్ర కథను అనిల్ చేతికి అందించారు. “షైన్ స్క్రీన్స్”, చిరంజీవి కూతురు సుస్మిత “గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్” ఈ సినిమాని కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ పేరు “శంకర్ వరప్రసాద్”. మనం ఇప్పటి వరకు చూడని చిరంజీవిని చూడబోతున్నామని అలాగే, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు దర్శకుడు అనిల్ తెలిపారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ను అందించనున్నారు.
అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా ఓ పెద్ద సవాల్. ఇప్పటివరకు అనిల్ దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీ ఫ్లాప్ అవ్వలేదు. పటాస్ (Pataas) నుంచి ఎఫ్2 (F2 Movie) అన్ని హిట్ సినిమాలే. మరీ ముఖ్యంగా, ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ అయితే రూ. 300 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి వెంకటేష్ (Venkatesh Daggubati) సినీ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అసాధ్యం అన్న దానిని కూడా సుసాధ్యం చేసిన ఈ డైరెక్టర్ చిరంజీవితో మూవీ అంటే ఇప్పుడు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయాల్సిందేనని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read: Ugadi Festival 2025: తెలుగువారి తొలి పండుగ.. ఉగాదిపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం..
అయితే, చిరంజీవి చిత్రాలు వసూళ్ల పరంగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. మరి, ముఖ్యంగా భోళా శంకర్ (Bhola Shankar) వంటి మూవీ నిరాశపరిచిన క్రమంలో మెగాస్టార్, అనిల్ భారీగా వసూళ్లు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి, అనిల్ కామెడీ ఫార్ములా వర్కవుట్ అయి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో ? లేదో చూడాల్సి ఉంది.