Youtuber Ali Aalyan Iqbal (image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!

Youtuber Ali Aalyan Iqbal: ప్రముఖ బైకర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అలీ ఆలియన్ ఇక్బాల్ (Ali Aalyan Iqbal) .. ఊహించని చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల లద్దాఖ్‌ (Ladakh)లో చేసిన బైక్ స్టంట్స్.. అతడ్ని సమస్యల్లోకి నెట్టాయి. అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఇక్బాల్ బైక్ విన్యాసాలు (Bike stunts) ఉన్నాయంటూ అతడిపై లేహ్ పోలీసులు (Leh Police) కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ (Twitter) వేదికగా ప్రకటించారు. లద్దాఖ్ లో పర్యటించేవారు ప్రకృతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్న సంకేతాన్ని ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
పాపులర్ యూట్యూబర్ గా, బైక్ రైడర్ గా గుర్తింపు పొందిన అలీ ఆలియన్ ఇక్బాల్.. జూన్ చివరి వారంలో జమ్ముకశ్మీర్ లోని లద్దాఖ్‌ పర్యటించారు. బైక్ రైడింగ్ లో మంచి ప్రావిణ్యం ఉన్న అతడు.. అక్కడ ఎన్నో విన్యాసాలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇక్బాల్ షేర్ చేశాడు. నెట్టింట అవి వైరల్ గా మారడంతో లేహ్ పోలీసుల కంట అవి పడ్డాయి. సున్నితమైన పాంగోంగ్ సరస్సు, నుబ్రా ఇసుక దిబ్బలపై (Pangong Lake & Nubra sand dunes) అనుమతి లేకుండా అతడు బైక్ స్టంట్ చేయడాన్ని లేహ్ పోలీసులు గుర్తించారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన కారణంగా అతడిపై కేసులు నమోదు చేశారు.

లేహ్ పోలీసులు ఏమన్నారంటే
ఇక్బాల్ పై కేసు నమోదు చేసినట్లు లేహ్ పోలీసులు ఎక్స్ వేదికగా ప్రకటించారు. సున్నితమైన లద్దాఖ్ పర్యావరణాన్ని ప్రమాదంలో పడేసినందుకు గాను అతడిపై BNS 2023 చట్టంలోని U/S 125 & 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు లద్దాఖ్ కు వచ్చే పర్యాటకలు.. అక్కడి పర్యావరణ వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ప్రకృతి పరిరక్షణకు ఏర్పాటు చేసిన స్థానిక చట్టాలను గౌరవించాలని లేహ్ పోలీసులు ఎక్స్ వేదికగా కోరారు. ఈ పోస్టుకు ఇక్బాల్ బైక్ స్టంట్ చేస్తున్న ఫొటోలను సైతం జత చేశారు.

Also Read: WhatsApp – AI: వాట్సప్‌లో గమ్మత్తైన ఏఐ ఫీచర్స్.. ఇలా ట్రై చేయండి.. థ్రిల్ అవుతారు!

నెటిజన్లు ఫైర్
లద్దాక్ లో ఇక్బాల్ చేసిన పనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘భారతదేశంలోని అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ప్రాంతాల్లో లద్దాఖ్ ఒకటి. ఎక్కువ ఫాలోవర్లు కలిగిన మీరు ఇలా చేయడం తప్పు. ఈ చర్యలు పర్యావరణానికి ఏమాత్రం ఉపయోగకరం కాదు. పైగా అవి వేలాదిమందిని ప్రభావితం చేస్తాయి’ అని ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘పర్యావరణాన్ని నాశనం చేయవద్దు’ అంటూ మరొకరు ఇక్బాల్ కు సూచించారు. మెుత్తం మీద లద్దాఖ్ లో ఇక్బాల్ చేసిన విన్యాసాలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఇక్బాల్.. ఆల్యన్ వ్లాగ్స్ (Aalyan vlogs) అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయ్యాడు. అతడి ఛానెల్ కు 2.74 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Also Read This: Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. జూన్‌లో 613% వృద్ధి.. కారణాలివే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు