WhatsApp - AI (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

WhatsApp – AI: వాట్సప్‌లో గమ్మత్తైన ఏఐ ఫీచర్స్.. ఇలా ట్రై చేయండి.. థ్రిల్ అవుతారు!

WhatsApp – AI: ప్రస్తుత రోజుల్లో వాట్సప్ అనేది ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తోటి ఉద్యోగులతో అనుసంధానం అయ్యేందుకు వాట్సప్ ఒక వారధిగా మారిపోయింది. కోట్లమంది వినియోగదారులు వాట్సప్ ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో.. వారికి ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించేందుకు మాతృ సంస్థ మెటా కృషి చేస్తోంది. అద్భుతమైన నయా ఫీచర్లను వాట్సప్ లోకి తీసుకొస్తూ సర్ ప్రైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సప్.. ఒక అద్భుతమైన ఏఐ ఫీచర్ ను లాంచ్ చేసింది. మరో కీలకమైన ఫీచర్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఆ రెండు ముఖ్యమైన ఫీచర్ల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏఐ చాట్ వాల్‌పేపర్ ఫీచర్
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో వాట్సప్ కొత్తగా మెటా ఏఐ (Meta AI) సాంకేతికతతో కూడిన ఒక కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత చాట్ వాల్‌పేపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సప్ యూజర్లు తమ చాట్ బ్యాక్ గ్రౌండ్ లను కొత్తగా, మరింత సృజనాత్మకంగా రూపొందించుకునేందుకు వీలు అవుతుంది. ఈ ఫీచర్ సేవలను పొందేందుకు iOS (ఐఫోన్) యూజర్లు వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్ (25.19.75)కి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ఉపయోగించే విధానం
ఏఐ ఆధారిత చాట్ వాల్ పేపర్ ఫీచర్ ను ఉపయోగించేందుకు యూజర్లు కొన్ని స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా వాట్సప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డిఫాల్ట్ చాట్ థీమ్ ను క్లిక్ చేయాలి. అందులో చాట్ థీమ్ లోకి వెళ్లాలి. అక్కడ కొత్తగా క్రియేట్ విత్ ఏఐ (Create with AI) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే పాప్ అప్ కార్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావాల్సిన వాల్ పేపర్ డిజైన్ ను టెక్స్ట్ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘సముద్ర తీరంలో సూర్యాస్తమయం’ లేదా ‘ఫ్లవర్ గార్డెన్’ అని ఇవ్వడం ద్వారా మీకు కావాల్సిన AI జనరేటెడ్ ఇమేజ్‌ కనిపిస్తుంది. అది మీకు నచ్చితే చాట్ వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు.

వీడియో కాల్.. బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్!
వాట్సప్ ను వీడియో కాల్స్ కోసం కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా తీసుకొచ్చిన ఏఐ ఆధారిత ఫీచర్ తో చాట్ వాల్ పేపర్ తరహాలోనే వీడియో కాల్ సమయంలో బ్యాక్ గ్రౌండ్ ను కూడా మార్చుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు ముందుగా వీడియో కాల్ లేదా వాట్సప్ కెమెరాను ఓపెన్ చేయాలి. అక్కడ మీకు ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, బ్యాక్ గ్రౌండ్ అనే మూడు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఎఫెక్ట్స్ లోకి వెళ్లి మీకు నచ్చిన ఎఫెక్ట్ ను తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫిల్టర్స్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ ఫేస్ ను మరింత అందంగా మార్చే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో నచ్చిన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. పైనల్ గా బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని ఫిక్స్డ్ బ్యాక్ గ్రౌండ్ అందుబాటులో ఉంటాయి. అందులో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఏఐను ఉపయోగించి మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఏఐ ఫీచర్ పరిమిత దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి ఎంపిక చేసిన భాషల్లోనే ప్రస్తుతానికి వినియోగించాల్సి ఉంటుంది.

Also Read: Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. జూన్‌లో 613% వృద్ధి.. కారణాలివే!

థ్రెడెడ్ మెసేజ్ రిప్లైలు
వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రస్తుతం వర్క్ చేస్తోంది. మెసేజ్ రిప్లైలను థ్రెడ్ ఫార్మట్ రూపంలో చూపించే కొత్త ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. iOS బీటా వెర్షన్ 25.19.10.80లో దీనిని పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రతి సందేశం దానికి సంబంధించిన రిప్లైల సంఖ్యను చూపించే ఒక చిన్న బ్యాడ్జ్‌ను కలిగి ఉంటుంది. ఆ బ్యాడ్జ్‌పై ట్యాప్ చేయడం ద్వారా, ఆ సందేశానికి సంబంధించిన అన్ని రిప్లైలను ఒక ప్రత్యేక స్క్రీన్‌లో చూడవచ్చు. ఇది సంభాషణను ట్రాక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. గ్రూప్ చాట్‌లలో ఒకే సమయంలో బహుళ సంభాషణలు జరిగినప్పుడు థ్రెడెడ్ రిప్లైలు ఏ సందేశానికి ఏ రిప్లై సంబంధించినదో స్పష్టంగా చూపిస్తాయి.

Also Read This: Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు