World Lipstick Day ( Image Source: Twitter)
Viral

World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?

World Lipstick Day: మహిళలు ఎక్కువగా లిప్‌స్టిక్ లను వాడుతుంటారు. ఏదయినా చిన్న ఫంక్షన్ ఉంటే చాలు.. అందంగా రెడీ అవుతారు. అందం అనగానే మనకీ గుర్తు వచ్చేది మేకప్. అయితే, వీటిలో లిప్‌స్టిక్ హైలెట్ గా నిలుస్తుంది. రాత్రిపూట బయటకు వెళ్ళేటప్పుడు ముదురు ఎరుపు లిప్‌స్టిక్ షేడ్ , ఇక వర్కింగ్ అవర్స్ లో రెడ్ షేడ్, వేర్వేరు సందర్భాలలో వేర్వేరు షేడ్స్ వాడుతుంటారు. అయితే, తరచుగా లిప్‌స్టిక్‌లను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలకు దారితీయవచ్చు అని ప్రపంచ లిప్‌స్టిక్ దినోత్సవం సందర్భంగా చర్మవ్యాధి నిపుణుడు వెల్లడించాడు.

Also Read: Suleiman Shah: పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఖేల్‌ఖతం.. ప్రతీకారం తీర్చుకున్న బలగాలు

“ పెదవులు సున్నితమైనవి. ఎందుకంటే వాటిలో నూనె గ్రంథులు ఉండవు, అలాగే వాటి పై పొర కూడా పలచగా ఉంటుంది, అవి పొడిబారడం, చికాకు, పిగ్మెంటేషన్‌కు గురవుతాయి. ముఖ్యంగా సింథటిక్ రంగులు, ప్రిజర్వేటివ్‌లు లేదా సువాసనలను కలిగి ఉన్న తక్కువ-నాణ్యత గల లిప్‌స్టిక్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల అలెర్జీ కాంటాక్ట్ చెలిటిస్, క్రానిక్ పపింగ్ వంటి సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి రోజు చివరిలో లిప్ స్టిక్ ను పూర్తిగా తొలగించకపోతే చర్మ సమస్యలకు వస్తాయని ” డెర్మటాలజిస్ట్ డాక్టర్ వెల్లడించారు.

Also Read: War2: ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా ఎవరిదో తెలుసా?

పెదవుల పైన పదేపదే అప్లై చేయడం వల్ల, ముఖ్యంగా హైడ్రేటింగ్ బేస్ లేకుండా, కొంతమంది మహిళల్లో పొడిబారడం లేదా చికాకు కలిగించవచ్చు. కొన్ని లిప్‌స్టిక్‌ల ఉత్పత్తులలో లెడ్ లేదా కాడ్మియం వంటి భారీ లోహాలు తక్కువ స్థాయిలో ఉండవచ్చని, ఇది దీర్ఘకాలంలో మీ పెదవులకు సురక్షితం కాదని చెబుతున్నారు.

Also Read: Srushti Fertility Centre: టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

కొన్ని అధ్యయనాల ప్రకారం, లిప్‌స్టిక్‌లలో సీసం (లెడ్), క్రోమియం, కాడ్మియం వంటి లోహాలు ఉండవచ్చని, ఇవి రోజూ ఎక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు. అయితే, ఈ లోహాలు సురక్షిత స్థాయిలలోనే ఉంటాయని, అతిగా ఉపయోగించనంత వరకు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?