Suleiman Shah
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Suleiman Shah: పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఖేల్‌ఖతం.. ప్రతీకారం తీర్చుకున్న బలగాలు

Suleiman Shah: ఈ ఏడాది ఏప్రిల్ 22న ఏకంగా 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న పహల్గామ్‌ ఉగ్రదాడికి సూత్రధారి అయిన హాషిమ్ మూసా అలియాస్ సులేమాన్ షా‌ను భద్రతా బలగాలు సోమవారం మట్టుబెట్టాయి. నరమేధం జరిగిన మూడు నెలల 6 రోజుల తర్వాత భారత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరిట ఈ ఉగ్రవేటలో సులేమాన్‌తో పాటు మరో ఇద్దరు ముష్కరులను కూడా మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు సమీపంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

ఎవరీ సులేమాన్ షా?
సులేమాన్ షా లష్కరే తొయిబా (LeT) ఉగ్రవాది. గతంలో పాకిస్థాన్ సైన్యంలో అత్యంత విశిష్టత ఉన్న స్పెషల్ సర్వీసెస్ గ్రూప్‌లో (SSG) కమాండోగా పనిచేశాడు. ఆ తర్వాత ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నాడు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాద సంస్థ, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాలో చేరాడు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహరచన చేసింది సులేమానే.  అతడి ఉగ్రచరిత్ర గట్టిగానే ఉంది. 2023 సెప్టెంబర్‌లో భారత్‌లోకి చొరబడ్డాడు. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు మొదలుపెట్టాడు. 2024 అక్టోబర్‌లో అతడి పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్మికులు బస చేస్తున్న క్యాంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 7 మంది పౌరులు చనిపోయారు. సొరంగ నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వెళ్లిన కార్మికులపై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నలుగురు భద్రతా సిబ్బంది మృతికి కారణమైన బారాముల్లా ఉగ్రదాడితో పాటు ఇతర దాడుల్లో కూడా అతడి పాత్ర ఉంది. మొత్తం మీద 6 ఉగ్రదాడుల్లో అతడి ప్రమేయం ఉన్నట్టు భద్రతా సంస్థలు గుర్తించాయి. సులేమాన్ షా తలపై రూ.20 లక్షల రివార్డ్ కూడా ఉంది.

Read also- Weight Loss Tips: బరువు తగ్గాలా.. జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ పండ్లు తింటే చాలు!

పహల్గామ్ దాడి తర్వాత వేట
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసారన్ లోయలో సులేమాన్ నేతృత్వంలో జరిగిన ఉగ్రవాద నరమేధంలో 26 మంది పౌరులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ తర్వాత అతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మర వేట ప్రారంభించాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా బలగాలు పహల్గామ్ ప్రాంలంలో ఇంటింటికీ వెళ్లి ఆచూకీ కోసం ప్రయత్నించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఎట్టకేలకు ఆచూకీ లభ్యం కావడంతో 2025 జులై 28న ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ చేపట్టి సులేమాన్ షాను హతమార్చారు. సోమవారం ఉదయాన్నే ఆపరేషన్‌‌ను ప్రారంభించారు. వారి స్థావరాన్ని చుట్టుముట్టి కాల్చిచంపేశారు.

Read Also- Shefali Jariwala’s Death: నటి మరణించి నెల.. కుక్క పేరుతో భర్త ఆసక్తికర పోస్ట్.. నెట్టింట వైరల్!

మరో భారీ దాడికి కుట్ర?

హైలెవెల్ టార్గెట్లు కావడంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు ముల్నార్ అడవుల్లో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. శ్రీనగర్‌కు సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉన్న ముల్నార్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ చేపట్టాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మహాదేవ్ కొండలు ఉండడంతో ‘ఆపరేషన్ మహాదేవ్’ అని పేరు పెట్టారు. దట్టమైన అడవుల్లో దాగున్నట్టు గుర్తించి సులేమాన్ షా, మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరంలో కార్బైన్ గన్స్, ఏకే-47 తుపాకులు, 17 రైఫిల్ గ్రెనేడ్లు, ఇతర అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి గుర్తించారు. ఈ స్థాయిలో ఆయుధాలను దాచిపెట్టడంతో ఈ ఉగ్రమూక కశ్మీర్‌లో మరో భారీ దాడికి సిద్ధమవుతోందన్న అనుమానాలను భద్రతా బలగాలు వ్యక్తం చేశాయి. సకాలంలో ఆపరేషన్ చేపట్టి లేపేయడంతో పెద్ద ఉగ్రనరమేధం తప్పినట్టేనని భావిస్తున్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో చచ్చిపోయిన ముగ్గురు ఉగ్రవాదులూ విదేశీయులేనని తెలుస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ