Shefali Jariwala’s Death: బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ షెఫాలి జరివాల (Shefali Jariwala) గత నెల జూన్ 27న (June 27, 2025) అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నిన్నటితో ఆమె మరణించి సరిగ్గా నెల పూర్తైన నేపథ్యంలో నటి భర్త పరాగ్ త్యాగి (Parag Tyagi) నెట్టింట ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆమెకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం నివాళులు అర్పిస్తున్నట్లుగా అందులో రాసుకున్నారు. అంతేకాదు శునకంతో ఆమెకు ఉన్న ఎఫెక్షన్ కు అద్దం పట్టే ఫొటోలను సైతం ఆ పోస్ట్ లో షేర్ చేశారు. ఈ ఎమోషనల్ పోస్ట్.. నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
పోస్ట్‌లో ఏముందంటే?
నటి షెఫాలి వర్మ భర్త పరాగ్ త్యాగి.. ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. పెంపుడు శునకం శింబాతో తన భార్య దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. సింబా తన తల్లితో పారి(షెఫాలి)తో మాట్లాడుతున్నట్లుగా పోస్ట్ కు సుదీర్ఘమైన, హృదయాలకు హత్తుకునే వ్యాఖ్యలను జత చేశారు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ అమ్మకు.. పారి తన బేబీ సింబాను ఎంతగా ప్రేమిస్తుందో సింబా కూడా తన అమ్మను అంతే ప్రేమిస్తాడు. ఈ రోజు సింబా నిన్ను ప్రత్యక్షంగా చూసి ఒక నెల అవుతోంది. అయినా సింబా నీ ఉనికిని, నీ ప్రేమను, నీ ఆప్యాయతను తన చుట్టూ పొందగలుగుతున్నాడు. అమ్మా ఎప్పుడూ సంతోషంగా, ఆశీర్వాదంతో ఉండాలి. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పుడూ ప్రార్థిస్తూ నా అమ్మను ప్రేమిస్తూనే ఉండాలి. అద్భుతమైన మిత్రులందరికీ ప్రేమతో – సింబా జరివాలా త్యాగి’ అంటూ పరాగ్ త్యాగి ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది.
View this post on Instagram
ఆ సాంగ్‌తో పాపులర్!
షెఫాలీ జరివాలా.. ‘కాంటా లగా’ అనే పాపులర్ సాంగ్ తో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. జూన్ 27న తన నివాసంలో ఆమెకు గుండెపోటు రావడంతో హుటాహుటీనా అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 42 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు. అయితే యాంటీ ఏజింగ్ చికిత్సలు, గ్లూటాథియోన్, విటమిన్ సి టాబ్లెట్లు.. షెఫాలి గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆమె మరణానికి కచ్చితమైన కారణం నిర్ధరణ కాలేదు.