Weight Loss Tips (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Weight Loss Tips: బరువు తగ్గాలా.. జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ పండ్లు తింటే చాలు!

Weight Loss Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది అతి పెద్ద సవాలుగా మారిన సంగతి తెలిసిందే. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్స్ లో గంటలకొద్ది చెమటలు కక్కించడాన్ని చూస్తూనే ఉంది. మరికొందరు డైట్ పేరుతో నోరు కట్టిసుకొని.. ఆకలిని ఓర్చుకుంటూ ఒంటిలోని కొవ్వు తగ్గించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అయితే ఇవేమి అవసరం లేకుండా కేవలం పండ్లు తిని బెల్లి ఫ్యాట్ లేదా బరువు తగ్గొచ్చని పిట్ నెస్ విమల్ రాజ్ పుత్ (Vimal Rajput) చెబుతున్నారు. తద్వారా 3 నెలల్లో 9 కేజీల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే కడుపు చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకునేందుకు 10 రకాల పండ్లను సైతం సిఫార్సు చేశారు. ఇంతకీ ఆ పండ్లు ఏవి? బరువు తగ్గేందుకు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి?

ద్రాక్ష పండ్లు (Grapefruit)
ఈ పండ్లు జీవక్రియ (మెటబాలిజం) వేగాన్ని పెంచి, శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఆపిల్స్ (Apples)
ఆపిల్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇది ఆకలిని ఎక్కువ సేపు నియంత్రించగలుగుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ)
బెర్రీస్ లో (Strawberries, Blueberries and Raspberries) అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి. కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

కివీ (Kiwi)
విటమిన్ సి (Vitamin C), ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు కొవ్వును తగ్గిస్తుంది.

అరటి (Banana)
అరటిలో ఉండే ఫైబర్, పొటాషియం ఆకలిని నియంత్రిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.

వాటర్‌మెలన్ (Water melon)
పుచ్చకాయలో ఉండే అధిక నీటి శాతం.. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.

పీచ్ (మకరంద పండు)
తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్ ఉండి తీపి కోరికలను తీరుస్తూ కొవ్వును తగ్గిస్తుంది.

పప్పాయ
పప్పాయపండు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో ఉండే ఎంజైమ్‌లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

అనారం (పొమెగ్రానేట్)
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి వాపును తగ్గించి.. కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.

Also Read: Shefali Jariwala’s Death: నటి మరణించి నెల.. కుక్క పేరుతో భర్త ఆసక్తికర పోస్ట్.. నెట్టింట వైరల్!

నాస్‌పతి (పియర్)
ఫైబర్ అధికంగా ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. అదే విధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Also Read This: Rakul Preet Singh: పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?