Rakul Preet Singh: సోషల్ మీడియా ట్రోల్స్‌పై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్
Rakul Preet Singh ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Rakul Preet Singh: పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్

పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్

– సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లపై ఫైర్ అయిన రకుల్
– ఫ్రీ డేటా చెత్త కామెంట్స్ కోసం వాడకండి
– కొందరికి వేరే పనే ఉండదు, వాళ్ళకి ఇతరులను బాధపెట్టడమే ఒక పని అంటూ విమర్శలు

Rakul Preet Singh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గత కొంత కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా, మరోసారి ఈమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Tourist Guide: టూర్లకు వెళ్తున్నారా.. ఈ మోసాల గురించి తెలుసుకోండి.. లేదంటే మీ పని ఔట్!

సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు, తన పై ట్రోల్స్ చేసే వారిపై మండిపడ్డారు. “ఏం చేద్దాం.. మన దేశంలో పనికిమాలిన వాళ్లు రోజు రోజుకు ఎక్కువైపోతున్నార. ఇంకా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసి, వారిని హర్ట్ చేయడమే కొందరి పనిగా మారింది. ఇంతకంటే వేరే పని లేకపోవడం దారుణం” అంటూ రకుల్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఘాటుగానే రియాక్ట్ అయింది. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:  Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?

నెటిజన్లు కూడా ఈ కామెంట్స్ పై స్పందిస్తున్నారు. కొందరు రకుల్ మాటలకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం ఆమె పై ఫైర్ అవుతున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన రకుల్, గత ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించిన ఆమె, ఇటీవల కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అభిప్రాయాలను ధైర్యంగా పంచుకుంటున్న రకుల్, ట్రోలర్లకు కూడా కౌంటర్లతో సమాధానం చెబుతూ బిజీగా మారింది. నెగిటివ్ మాట్లాడే వారిపై ఆమె చేసిన ఈ కామెంట్లు, సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తు చేశాయి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?