HariHara VeeraMallu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Harihara Veeramallu: ఇదేదో ముందే చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా.. నిర్మాత పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్

Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ నటించిన హీరోగా నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ జులై 24, 2025న రిలీజ్ అయింది. అయితే, సినిమా ఎంత పాజిటివ్ గా ముందుకెళ్ళాలనుకున్నా కథలో కొన్ని మైనస్ లు ఉండటంతో ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా VFX, స్క్రీన్‌ప్లే లోపాలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే, నిర్మాతలు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించి, మళ్లీ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ మార్పుల్లో గుర్రపు స్వారీ సన్నివేశాలు, బాణం సన్నివేశం, ఫ్లాగ్ సన్నివేశం, తుఫాను సన్నివేశాలను VFX లో రీ ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఈ మార్పుల తర్వాత సినిమా చాలా బావుందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఈ మార్పులు ముందే చేసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Rakul Preet Singh: పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్

అయిన సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి, VFX లోపాలపై నెటిజన్లు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. “బండరాయి సన్నివేశాన్ని చాలా మార్చారు, గుర్రపు స్వారీ సన్నివేశాలను రెండు షాట్లకు పరిమితం చేశారు, ఫ్లాగ్ సన్నివేశం తొలగించారు, యాగం సన్నివేశంలో మూడు బాణాల షాట్ బావుంది. ప్రీ-క్లైమాక్స్ ఇప్పుడు క్లైమాక్స్‌గా మారింది” అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు.

Also Read:  Child Offering Ritual: వామ్మో ఇదేం పద్ధతి.. ఆ జిల్లాలో పిల్లలను వేలం పాటలో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు?

మరో అభిమాని, “వీప్స్ మీద ముందే దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేదని” అని అభిప్రాయపడ్డారు. ఈ సవరణలతో థియేటర్లలో కొత్త వెర్షన్ ఆడుతుండగా.. బుకింగ్స్ పెరుగుతున్నాయి. అలాగే, మౌత్ టాక్ కూడా మారింది. అయితే, ఈ మార్పులు ముందే చేసి ఉంటే సినిమాకు మరింత పాజిటివ్ టాక్ వచ్చి ఉండేదని అభిమానులు ఫీలవుతున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు