Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎందరో నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు. ఉన్నన్నిరోజులు వాళ్లు చేసిన సూపర్ డూపర్ సినిమాలు, మనసుకు హత్తుకునే మూవీస్‌ను నాటి నుంచి నేటి వరకూ గుర్తుంటూనే ఉంటాయి. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌లానే నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఫ్యామిలీ సినిమా ‘సంతోషం’ (Santhosham) అభిమానులు, సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన గ్రేసీ సింగ్ గురించి అయితే ఆడియన్స్‌కు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ భార్యగా ఫ్లాష్ బ్యాక్‌లో క్యారెక్టర్ ‘ఔరా’, ‘వారెవ్వా’ అనిపిస్తుంది అంతే. ఈ ముద్దుగుమ్మ సినిమాలో ఉండేది కాసేపే అయినా తన నటన, అందం, అభినయంతో అదరగొట్టేసింది. అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!
లాంగ్ గ్యాప్‌లో వచ్చినా..?
శ్రీకాంత్, మోహన్‌బాబు కాంబోలో 2002లో వచ్చిన ‘తప్పు చేసి పప్పు కూడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లాంగ్ గ్యాప్ ఇంచుమించు 8 ఏళ్ల తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలో అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది. అదే సంవత్సరంలోనే అబ్బాస్, ఆకాష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘రామ్ దేవ్’ సినిమాలో గ్రేసీ మెరిసింది. మొత్తమ్మీద తెలుగులో ముచ్చటగా మూడండే సినిమాల్లో నటించి, ఒక అతిథి పాత్రకే ఈ ఢిల్లీ భామ సరిపెట్టుకుంది. 2015లో ‘చూరియన్’ అనే పంజాబీ సినిమాలో చివరిసారిగా నటించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ తెలుగుతో పాటు ఏ భాషల్లోనూ నటించలేదు. అంతేకాదు కనీసం మీడియా ముందుకు కూడా వచ్చినట్లు దాఖలాల్లేవ్. అంతా ఓకేకానీ ఈ ముదురు భామ ఇంతవరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? 1980, జూలై 2న పుట్టిన బ్యూటీకి 45 ఏళ్లు. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా? లేదా అనేది తెలియట్లేదు కానీ.. ఇప్పటి వరకూ సింగిల్‌గానే ఉండిపోయింది.
కారణమేంటి?
2013లోనే గ్రేసీ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో మెంబర్‌గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండిపోయింది. చిన్న నాటి నుంచి డ్యాన్స్ అంటే మక్కువతో తన పేరిట ‘గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్’ను కూడా ప్రారంభించింది. ఈ ట్రూప్‌తో ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా నృత్య ప్రదర్శనలు ఇస్తుంటుంది. తన జీవితాన్ని అటు నాట్యం, ఇటు నటన, ఆధ్యాత్మికతకే అంకితం చేసింది. అందుకే పెళ్లి అంటే ఆసక్తి లేదని ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో మనసులోని మాటను బయటపెట్టింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముదురు భామ యమా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. రోజుకో పోస్టు, ఫోటోలు పోస్టు చేస్తూ వావ్ అనిపిస్తుంటుంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also- NEET Exam: నీట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?