NEET Exam Postponed
జాతీయం, లేటెస్ట్ న్యూస్

NEET Exam: నీట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

NEET Exam: నీట్‌ పీజీ పరీక్ష వాయిదా పడింది. జూన్‌ 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈ జాతీయస్థాయి అర్హత పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన అదనపు పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌బీఈఎంఎస్ ప్రకటనలో పేర్కొన్నది. అయితే ఈ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? ఏ తేదీన నిర్వహిస్తాం? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటిస్తామని బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (Board Of Examination) తెలిపింది. కాగా, పరీక్ష వాయిదా పడినందున, సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ (Admit Cards) విడుదల తేదీలు కూడా మారుతాయి. వీటి గురించి త్వరలోనే సమాచారం ఎన్‌బీఈఎంఎస్ నుంచి రానుంది.

Read Also- Mid Day Meals: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. జూన్ 12 నుంచి అమలు

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
జూన్ 15న నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తొలుత నిర్ణయించింది. అయితే దీనిపై అభ్యంతరాలు రావడంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది. దీనిపై మే-30న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. పరీక్షను ఒకే షిఫ్టులోనే నిర్వహించాలని బోర్డు‌ను ఆదేశించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించినట్లు అవుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పరీక్ష ప్రక్రియలోనూ పారదర్శకతను నిర్ధారించడానికి ఉపయోగపడుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విక్రమ్‌నాథ్ (Justice Vikramnath), జస్టిస్ ఎన్వీ అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. కాగా, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎస్ఈబీ వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతోపాటు జూన్ 15న పరీక్ష నిర్వహించడానికి చాలా సమయమే ఉంది కదా? అని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో సుప్రీం ఆదేశాలను పాటిస్తూ జూన్-2న సాయంత్రం నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నీట్ పీజీ (NEET PG) అనేది భారతదేశంలో వైద్య విద్యలో ఎండీ (MD), ఎంఎస్ (MS), పీజీ డిప్లొమా (PG Diploma) కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. ఈ ఎగ్జామ్ ద్వారానే దేశవ్యాప్తంగా ఉన్న అనేక మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు. ఫలితాల ఆధారంగా స్టూడెంట్స్‌కు ర్యాంకులు, సీట్లు కేటాయించడం జరుగుతుంది.

Read Also- Siddu Jonnalagadda: హీరోయిన్స్‌కు వీడియో కాల్స్.. అడ్డంగా బుక్కయిన హీరో!

ప్రకటన ఇదే..

NEET Exam

Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?