Siddu
ఎంటర్‌టైన్మెంట్

Siddu Jonnalagadda: హీరోయిన్స్‌కు వీడియో కాల్స్.. అడ్డంగా బుక్కయిన హీరో!

Siddu Jonnalagadda: డీజే టిల్లూ సినిమాలతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సాధించాడు సిద్దు జొన్నలగడ్డ. 2009లో జోష్ (Josh) సినిమాతో ఆరంగేట్రం చేసిన సిద్దు, ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు, డాన్ శీను, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, ఐస్ క్రీమ్ 2 ఇలా క్యారెక్టర్ ఏదైనా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. 2016లో వచ్చిన గుంటూరు టాకీస్‌తో సిద్దూ సినీ కెరీర్ టర్న్ తీసుకుంది. అందులో బోల్డ్ కంటెంట్ కారణంగా చాలాకాలం సినిమాలకు దూరమయ్యాడు. తర్వాత కొన్ని సినిమాలు చేసినా పేరు రాలేదు. 2022లో వచ్చిన డీజే టిల్లూ (DJ Tillu) సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. 2024లో టిల్లూ స్క్వేర్ అంటూ పలకరించాడు. మిస్టర్ బచ్చన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసి అలరించాడు. అయితే, ఈ ఏడాది వచ్చిన జాక్ మూవీ నిరాశపరచగా, ఇప్పుడు తెలుసు కదా (Telusu Kada) చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.

నీరజ డైరెక్షన్‌లో తెలుసు కదా

కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన్ తెలుసు కదా చిత్రానికి దర్శకురాలు. ఈమెకు ఇదే తొలి చిత్రం. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నది. తాజాగా ఈ మూవీని అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను వదిలారు.

Read Also- RBI Gold Loan Rules: గోల్డ్ లోన్స్‌పై ఆర్బీఐ వర్సెస్ కేంద్రం.. అసలేంటీ గొడవ.. తప్పెవరిదీ!

ప్రమోషన్‌లో ఇదో రకం

ఈ రోజుల్లో ప్రమోషన్లు కాస్త డిఫరెంట్‌గా చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తున్నది. దీనికి చక్కటి ఉదాహరణ సంక్రాంతికి వస్తున్నాం. తనదైన స్టయిల్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్ చేసి చిత్రానికి హైప్ తీసుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మూవీకి ముహూర్తం దగ్గరి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టాడు. ఇదే స్ఫూర్తితో తెలుసు కదా చిత్ర బృందం కూడా వెరైటీ వీడియోను రిలీజ్ చేసినట్టుగా ఉంది.

హీరోయిన్స్‌కు వీడియో కాల్స్

తెలుసు కదా సినిమా థీం, పాయింట్ ఎలా ఉండబోతున్నాయో చెబుతూ ఈ వీడయోతో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న కుర్రాడి కథతో తెరకెక్కించినట్టు అర్థమవుతున్నది. దీనిని నీరజ కో ఎలా హ్యాండిల్ చేశారన్నది తెలియాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే. గతంలో ఇలాంటి ముక్కోణపు ప్రేమ కథలు చాలానే వచ్చాయి. కానీ, ఈ మూవీలో కొత్తగా ఏం చూపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ప్రమోషన్ వీడియో విషయానికి వస్తే, సిద్దుకు శ్రీనిధి వీడియో కాల్ చేస్తుంది. ఎందుకు చేశావని అడిగితే చూడాలనిపించింది అని చెప్తుంది. ఇంతలో రాశి ఖన్నా కూడా వీడియో కాల్ చేస్తుంది. ఆఫీస్ కాల్ అని శ్రీనిధికి అబద్ధం చెప్తాడు సిద్దు. ఆమెతో చెప్పిన మాటలనే రాశీ ఖన్నాతోనూ చెప్తాడు. శ్రీనిధి మళ్లీ కాల్ చేయగా వెయిటింగ్ వస్తుంది. రాశీ కాల్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించగా, అదే సమయంలో శ్రీనిధి రాశికి కాల్ చేస్తుంది. ఆమె లిఫ్ట్ చేయడంతో ఇద్దరు భామల మధ్య సిద్దు బుక్కవుతాడు. ఈ వీడియోతో సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో నీరజ కోన ఓ క్లారిటీ ఇచ్చినట్టయింది.

Read Also- Anushka Shetty: రెండేళ్ల తర్వాత స్వీటీ.. ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?