Anushka Shetty
ఎంటర్‌టైన్మెంట్

Anushka Shetty: రెండేళ్ల తర్వాత స్వీటీ.. ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Anushka Shetty: బాహుబలి (Bahubali) తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది అనుష్క (Anushka). ఆ తర్వాత చాలాకాలానికి ఘాటీ (Ghaati) మూవీకి సైన్ చేసింది. దీనికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఉత్కంఠభరితమైన ఈ క్రైమ్ డ్రామా మొదట ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉన్నది. కానీ, అది జరగలేదు. ఇప్పుడు కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

జులైలో స్వీటీ ఫ్యాన్స్‌కు పండుగే..

ఎట్టకేలకు ఘాటీ మూవీని 2025 జులై 11న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో యూవీ క్రియేషన్స్ పోస్ట్ చేయగా, ఇందులోని నటీ నటులు అనుష్క, విక్రమ్ ప్రభు, చైతన్య రావు తదితరులు కూడా పోస్టులు పెట్టారు. అనుష్క విక్రమ్ ప్రభు, చైతన్య రావు నదిని దాటుతున్నట్టు ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 11న ఘాటీ మూవీ గ్రాండ్ రిలీజ్ అంటూ అనుష్క శెట్టి ఎక్స్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నాయకురాలి పాత్రలో అనుష్క

ఈ సినిమాలోని అనుష్క శెట్టి పాత్రను పరిచయం చేస్తూ ఇంతకుముందూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. దాన్నిబట్టి ఆమెది నాయకురాలి పాత్రగా అందరూ అనుకుంటున్నారు. ధైర్యం, ఎవరికీ లొంగని ఆమె స్ఫూర్తిని అందరూ కీర్తించేలా క్రిష్ ఈ మూవీని తెరకెక్కించినట్టు అర్థమౌతున్నది. కథ విషయానికి వస్తే, గంజాయి, మత్తు వ్యాపారం చుట్టూ తిరుగుతుంటుందని సమాచారం.

Read Also- Rajamouli on Shreyas Iyer: శ్రేయాస్ కోసం జక్కన్న.. బీసీసీఐకి సూటి ప్రశ్న.. జస్ట్ ఆస్కింగ్!

ఘాటీ మూవీ గురించి మరిన్ని విషయాలు

ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. చింతకిది శ్రీనివాస్ రావు రచయితగా పని చేశారు. రమ్యకృష్ణ, జగపతిబాు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, గణేష్, దేవికా ప్రియదర్శిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఘాటీ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. అనుష్క చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ 2023 సెప్టెంబర్ 7న విడుదలైంది. అప్పటి నుంచి అనుష్క ఏ చిత్రం చేసింది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు, దాదాపు రెండేళ్లకు ఘాటీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నది.

మలయాళ మూవీ చేస్తున్న స్వీటీ

ఇదే ఏడాది అనుష్క నటించిన మరో చిత్రం కూడా విడుదలకు సిద్ధమౌతున్నది. అది మలయాళ మూవీ కథనార్. జయసూర్య హీరోగా నటిస్తుండగా, అనుష్క శెట్టితోపాటు ప్రభుదేవా, వినీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేయలేదు కానీ, ఈ ఏడాదే విడుదల చేయాలని చిత్రబృందం చూస్తున్నది. రోజిన్ థామస్ కథనార్ మూవీకి దర్శకుడు.

Read Also- Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ