Rajamouli on Shreyas Iyer: స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి నటులు జక్కన్న అని పిలుచుకుంటారు. అయితే, తాజాగా రాజమౌళి పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నడూ లేని విధంగా క్రికెటర్ గురించి ఎక్స్ లో ట్వీట్ పెట్టడం పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై పై పంజాబ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ తన ఆట తీరుతో అందర్ని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
Also Read: Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్
” బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ బౌండరీకి నడిపించిన అయ్యర్ (Shreyas Iyer) ఆట అద్భుతంగా ఉంది. ఈ వ్యక్తే ఢిల్లీని ఫైనల్ వరకు నడిపించాడు. అలాగే అదే టీం నుంచి తొలగించబడ్డాడు. ఇది మాత్రమే కాకుండా కోల్‌కతాను ట్రోఫీకి నడిపించాడు. అక్కడ కూడా తొలగించారు. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత యువ పంజాబ్‌ను ఫైనల్‌కు వరకు తీసుకెళ్ళాడు. ఈ ఏడాది ట్రోఫీకి కూడా అతను అర్హుడు. మరోవైపు, కోహ్లీ కూడా ఏళ్ల తరబడి క్రికెట్ ఆడుతూ తన బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ వేల పరుగులు సాధిస్తున్నాడు. అతనికి చివరి సరిహద్దు. అతను కూడా దానికి అర్హుడు. ఫలితం ఎలా ఉన్నా ఏదైనా.. చాలా బాధగా ఉందంటూ ” ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూస్తుంటే.. ఇంగ్లాండ్ పర్యటనకు శ్రేయస్ ను ఎంపిక చేయకపోవడంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025