WhatsApp Username: యూజర్ల ప్రైవసీ, డేటా సెక్యూరిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లు అందిస్తుంటుంది. వ్యక్తిగత చాట్స్, కాల్స్, స్టేటస్‌లను మరింత సెక్యూర్‌గా ఉండేలా ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్’ను తరచూ అప్‌డేట్ చేస్తూ, ప్రైవసీ కోసం కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తన యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేసేందుకుగానూ 2026లో మరో సంచలన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి మాతృసంస్థ ‘మెటా’ ఇంజనీర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
నంబర్ కనబడకుండా చాటింగ్, కాల్స్
ప్రస్తుతం వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ చేసినా, కాల్ చేసినా మన ఫోన్ నంబర్‌ను అవతలి వ్యక్తులకు ఇచ్చేసినట్టే లెక్క. ఈ కారణంగా యూజర్ల ప్రైవసీ దెబ్బతింటోంది. దీనిని అధిగమించేందుకుగానూ 2026 చివరిలో ‘యూజర్‌నేమ్’ (WhatsApp Username) అనే ఫీచర్‌ను మెటా కంపెనీ తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు, వ్యాపార సంస్థలు తమ ఫోన్ నంబర్లలను అవతలి వ్యక్తులకు వెల్లడించకుండానే కనెక్ట్ అవ్వొచ్చు. నంబర్ కనబడకుండానే చాటింగ్ చేయడానికి, కాల్స్ మాట్లాడడానికి వీలుంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ స్టేజ్ టెస్టింగ్‌లో ఉంది. సాధారణ యూజర్లతో పాటు వ్యాపార సంస్థలు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. ఒక అప్‌డేట్‌కు సంబంధించిన ప్రకటనలో వాట్సప్ ఈ విషయాలను వెల్లడించింది.
Read Also- Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?
నంబర్‌కు బదులు ‘పేరు సెర్చింగ్’
ప్రస్తుతం నంబర్ల ఆధారంగా వాట్సప్‌లో యూజర్లను గుర్తిస్తుంటారు. అయితే, ప్రత్యేకమైన ‘యూజర్‌నేమ్’ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్లు పేర్లను సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వొచ్చు. తద్వారా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయినప్పుడు కంటాక్ట్ నంబర్ వివరాలు వెల్లడికాబోవు. పేరు మాత్రమే అవతలి వ్యక్తులకు కనిపిస్తుంది. ఈ విధానంలో యూజర్లు స్పామ్ కాల్స్, మెసేజుల నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు. అపరిచితుల నుంచి అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజులకు చెక్ పెట్టవచ్చు. ప్రతి యూజర్‌కు యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. దీనితో సదరు యూజర్‌ను సులభంగా గుర్తింవచ్చని వాట్సప్ చెబుతోంది. వ్యాపార సంస్థలు బిజినెస్ స్కోప్డ్ యూజర్ ఐడీని ఉపయోగించి కస్టమర్లతో కమ్యూనికేషన్ చేయవచ్చు. కాబట్టి, ఏవిధంగా చూసినా ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది.
Read Also- Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు
బాగా టైమ్ పట్టింది!
యూజర్ల ప్రైవసీకి అత్యంత కీలకమైన ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను తీసుకురావాలని వాట్సప్ ఎప్పటినుంచో భావిస్తోంది. కానీ, దీని కోసం అవసరమైన ప్రధాన గుర్తింపు వ్యవస్థను సమగ్రంగా మార్చడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను రూపొందించడానికి, అంచనా కంటే ఎక్కువ సమయం పట్టిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్‌నేమ్ ఆధారిత పరస్పర కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది. ఎన్‌క్రిప్షన్‌తో సేవలు అందించేందేలా మెటా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఈ ఫీచర్ కోసం పెద్ద టూల్స్‌ను తిరిగి డెవలప్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రైవసీ ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా విస్తృతమైన సెక్యూరిటీ అందించే దిశగా వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
