stardam-tollywood( X)
ఎంటర్‌టైన్మెంట్

Heroes rejected hits: ఆ సినిమాలను వారు రిజక్ట్ చేయకుంటే స్టార్లు అయిపోయేవారు.. ఎవరంటే?

Heroes rejected hits: టాలీవుడ్ ఎందరో హీరోలకు ఓవర్ నైట్ లో వారికి విజయాలు వచ్చి పడలేదు. ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకాదరణ పొందిన తర్వాతే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ ఎన్ని ఎన్ని సినిమాలు తీసినా ఒక్క హిట్ పడకపోతే మాత్రం ఆ హీరో అలాగే ఉండిపోతాడు. టాలీవుడ్ ఒక సినిమా, ఒక క్యారెక్టర్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క డైలాగ్, ఒక స్టెప్… అంతా చర్చనీయాంశమవుతుంది. కొన్ని సార్లు ఒక ‘నో’ అనే పదం, మీరు సూపర్‌స్టార్ అయిపోయే అవకాశాన్ని దూరం చేస్తుంది. డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ‘ఇది నాకు సరిపోదు’ అని ఒక్క మాట చెప్పి, ఆ సినిమా మరొకరి చేతిలో పడి అనుకోకుండా వారిని స్టార్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి కొన్ని కథలు చూద్దాం. రిజెక్ట్ చేసి, రెగ్రెట్ చేసిన హీరోల గురించి తెలుసుకుందాం.

Read also-Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..

శర్వానంద్

అర్జున్ రెడ్డి – ఒక ‘నో’తో మిస్ అయిన ఫెనామెనన్. 2017లో ఒక డైరెక్టర్, సందీప్ రెడ్డి వంగా, తన డెస్క్‌పై కూర్చుని శర్వానంద్‌కు స్క్రిప్ట్ పిచ్ చేస్తున్నాడు. “హీరో ఒక సర్జన్, లవ్‌లో పడి డ్రగ్స్, యాంగర్ గా మారిపోతాడు.. ఇది పూర్తి క్యారెక్టర్ ఆర్క్!” శర్వానంద్ లైక్ చేస్తాడు, కానీ “సారీ, ఇది నా ఇమేజ్‌కు సరిపోదు” అంటాడు. ఫలితం? ఆ స్క్రిప్ట్ విజయ్ దేవరకొండ చేతిలో పడుతుంది. అర్జున్ రెడ్డి బ్లాక్‌బస్టర్ అవుతుంది, విజయ్ ‘రౌడీ’ స్టార్ అవుతాడు, హిందీ రీమేక్ కబీర్ సింగ్తో పాన్-ఇండియా హైప్ వస్తుంది.

సుమంత్

సుమంత్ – 2000ల చివరలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుమంత్. ‘సత్యం’తో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వత పూరీ జగన్నాధ్ 2006లో కొంటి కుర్రాడి రొమాంటిక్ యాక్షన్ స్క్రిప్ట్ తీసుకువచ్చాడు. హీరో ఒక జర్నలిస్ట్, నన్‌తో లవ్… ఫైట్స్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. సుమంత్ విన్నాడు, “ఇది నాకు సరిపోదు, నన్‌తో లవ్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది” అని రిజెక్ట్ చేశాడు. కట్ చేస్తే. స్క్రిప్ట్ అల్లు అర్జున్ చేతిలో పడుతుంది. దేశముదురు సూపర్ హిట్ అవుతుంది. అర్జున్‌కు మాస్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు సుమంత్ మంచి యాక్టర్‌గా ఉన్నాడు, కానీ అల్లు అర్జున్ లెవల్ స్టార్డమ్ మిస్ అయింది. ఆయన కెరీర్‌లో హిట్స్ తగ్గి, ఫేడ్ అవ్వడానికి ఇలాంటి రిజెక్షన్లు ఒక కారణమని ఫ్యాన్స్ అంటారు.

Read also-Kaantha trailer: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా మరి..

రాజశేఖర్

80-90ల మాస్ హీరో రాజశేఖర్, వి.వి. వినాయక్ ఓ కథ చెప్పారు. “కాప్ హీరో, కుటుంబానికి రివెంజ్. పవర్‌ఫుల్ యాక్షన్!” అప్పుడు రాజశేఖర్, బిజీ షెడ్యూల్‌లో “డేట్స్ లేవు బ్రో, సారీ!” అనడంతో. స్క్రిప్ట్ చిరంజీవి చేతికి చేరింది. ఠాగూర్ – ఎపిక్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకూ మెగాస్టార్ కు ఉన్న స్టేటస్ మరింత పెరిగింది. రాజ శేఖర్ మాత్రం అలాగే ఉండిపోయారు. అది మాత్రమే కాదు! రాజశేఖర్ లక్ష్మీ నరసింహ (బాలయ్య హిట్), చంటి (వెంకటేష్ కమ్‌బ్యాక్), నేనే రాజు నేనే మంత్రి (రాణా బ్రేక్‌త్రూ) కూడా వదిలేశాడు. ఫలితం? 90ల చివర్లో కెరీర్ ఫేడ్ అయిపోయింది. ఒక ఠాగూర్ చేసి ఉంటే? ఇప్పటికీ టాప్ హీరోగా ఉండేవారు.

Just In

01

Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు

India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?

Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jaundice: జాండీస్‌ ఎందుకు వస్తుంది? షాకింగ్ నిజాలు చెప్పిన వైద్యులు