Virat Kohli Record
Viral, లేటెస్ట్ న్యూస్

Virat Kohli Record: కోహ్లీ నా మజాకా.. వార్నర్ రికార్డు మటాష్

Virat Kohli Record: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (RCB vs Pbks) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌ (IPL 2025 Final) మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రాణించాడు. అత్యంత ముఖ్యమైన ఈ పోరులో 35 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. మూడు ఫోర్లు కూడా బాదాడు. విరాట్ రాణించడంతో ఫైనల్ మ్యాచ్ ఆర్‌సీబీ  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు నమోదు చేయగలిగింది.

Read this, IPL 2025 Final: ఐపీఎల్ కోసం పెళ్లి పక్కనెట్టేశాడు.. ఆ క్రికెటర్ నిజంగా గ్రేట్!

కీలకమైన ఇన్నింగ్స్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ మరో ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్న మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున పంజాబ్ కింగ్స్‌పై మొత్తం 26 మ్యాచ్‌లు ఆడి 1,134 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై 36 మ్యాచ్‌లు ఆడి 1,159 పరుగులు సాధించాడు. దీంతో, డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలైంది.

Read this, RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!

పంజాబ్ కింగ్స్‌పై 1,159 పరుగులు సాధించడంతో ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా. తన పేరిటే ఉన్న రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కోహ్లీ 1,146 పరుగులు సాధించగా, పంజాబ్ కింగ్స్‌పై 1,159 రన్స్ సాధించడంతో ఆ రికార్డు చెరిగిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. బెస్ట్ స్కోర్ 113 పరుగులుగా ఉంది.

Read this, ipl final 2025: ఒకే ఒక్కడు.. ఫైనల్ వేళ అందరి దృష్టి అతడి పైనే!

ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లపై అత్యధిక పరుగులు

1. 1,159 – పంజాబ్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ
2. 1,146 – సీఎస్కేపై విరాట్ కోహ్లీ
3. 1,134 – పంజాబ్ కింగ్స్‌పై డేవిడ్ వార్నర్
4. 1,130 – ఢిల్లీ క్యాపిటల్స్‌పై విరాట్ కోహ్లీ
5. 1,093- కేకేఆర్‌‌పై డేవిడ్ వార్నర్
6. 1,083 – కేకేఆర్‌పై రోహిత్ శర్మ

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు